అనంతపురం: టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ  పోలీసు అమరవీరుల బూట్లను తుడిచి ఆ బూట్లను ముద్దాడాడు. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శోచనీయమన్నారు.

శుక్రవారం నాడు అనంతపురంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి ముద్దాడాడు.

Also read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం: సమర్ధించుకొన్న జేసీ దివాకర్ రెడ్డి

పోలీసులపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తారని ఆయన గుర్తు చేశారు. అలాంటి పోలీసులపై జేసీ దివాక్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నాడని ఎంపీ మండిపడ్డారు.

జేసీ దివాకర్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎంపీ మాధవ్ హితవు పలికారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిని చంద్రబాబునాయుడు మందలించాలని ఆయన కోరారు.

Also read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

తనపై గతంలో వ్యాఖ్యలు చేసిన  ప్రజలు బజారుపాలు చేశారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే తనను ప్రజలు పార్లమెంట్‌కు పంపారని గోరంట్ల మాధవ్ చెప్పారు.

రెండు రోజుల క్రితం అనంతపురంలో జరిగిన టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబునాయుడు సమక్షంలోనే టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ నేతలకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటామని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేవారు. గంజాయి పెట్టి కేసులు పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు.చంద్రబాబు కూడ శాంతి వచనాలు పాటించకూడదని ఆయన కోరారు. 

ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా కూడ గురువారం నాడు తేల్చి చెప్పారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలకు పోలీస్ అధికారుల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలకు ఆనాడు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడుగా ఉన్న గోరంట్ల మాధవ్ జేసీ దివాకర్ రెడ్డిపై తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డిపై ఒంటి కాలిపై లేచారు. జేసీ దివాకర్ రెడ్డి కూడ గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. హిందూపురం నుండి ఎంపీగా విజయం సాధించాడు.