Asianet News TeluguAsianet News Telugu

‘‘పెథాయ్’’ ఎఫెక్ట్: ఏపీలో వర్షం, తెలంగాణలో చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఏపీపై వర్షం విరుచుకుపడితే.. తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి.  ఈదురుగాలులతో పాటు శీతలగాలులతో తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

phethai effect on Andhra Pradesh and telangana
Author
Hyderabad, First Published Dec 18, 2018, 7:50 AM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఏపీపై వర్షం విరుచుకుపడితే.. తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి.  ఈదురుగాలులతో పాటు శీతలగాలులతో తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అయితే మంచుముద్దను తలపిస్తోంది. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, తాండూరు జనాలు 3 రోజులుగా వణికిపోతున్నారు. రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. తాండూరులో 8.3 డిగ్రీలు, మెదక్‌ 13, ఆదిలాబాద్ 14, హన్మకొండలో 15, నిజామాబాద్ 17, నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మంలో 18, మహబూబ్‌నగర్, రామగుండంలో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

Follow Us:
Download App:
  • android
  • ios