ప్రజల్లో సానుభూతి పొందడానికే  వైసీపీ అధినేత జగన్ నాటకాలు ఆడుతున్నారని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ అభిమాని దాడిచేస్తే దానిని టీడీపీపై రుద్దడానికి వైసీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా కృ షి చేస్తున్నాయని విమర్శించారు. 

ఘటన జరిగిన నిమిషాల్లోనే ప్రక్క రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్‌, కేటీర్‌, కవిత, గవర్నర్‌ స్పందించడం, గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేయడం చూస్తే ఏం జరుగుతుందో ప్రజలకుఅర్ధమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు తితలీ తుపానుకు అతలాకుతలమైతే స్పందించని వారంతా ఇప్పుడు స్పందిస్తున్నారంటే ఏపీపై ఎంత కుట్ర జరుగుతోందో తేటతెల్లమవుతోందన్నారు.
 
విశాఖ ఎయిర్‌పోర్టులో గాయమైతే... ప్రక్క రాష్ట్రంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం చేతిలో జగన్‌ కీలు బొమ్మగా మారారన్నారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యసిబ్బంది జగన్‌ భుజానికి 0.05 సెంటీమీటర్లు గాయమైందని చెబితే హైదరాబాద్‌ న్యూరోసిటీ వైద్యులు 3. 5 సెంటీమీటర్లు గాయమై 9 కుట్లు పడ్డాయని ప్రకటించారని, అంత గాయమైతే జగన్‌ హైదరాబాద్‌ వరకు వెళ్లగలిగేవారా? అని ప్రశ్నించారు. వైసీపీ మిత్రపక్షం కాదంటూనే ఢిల్లీలో జీవీఎల్‌ గంట వ్యవధిలోనే ప్రెస్‌మీట్‌ పెట్టడం దేనికన్నారు.
 
వీరంతా ఒకటేనని తేలిపోయిందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచి శాంతి భద్రతల కు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీ ఇతర సామాజిక వర్గాలపై కేంద్రం సీబీఐ దాడులు చేయించడం సరికాదన్నారు. ఇతర పార్టీల నాయకులకూ, ఎంపీలకూ, మంత్రులకు ఆస్తులు, వ్యాపారాలు లేవా? అని ప్రశ్నించారు. ఏపీలో ఒక బీజేపీ నేత రూ.వేల కోట్లు సంపాదించిన దాఖలాలున్నాయన్నారు. బర్నికాన బాబూరావు, కొటాన అప్పారావు, మహాలక్ష్మీనాయుడు, గండి దేముడు తదితరులు పాల్గొన్నారు.

more news

బాబు ఫ్యాక్షనిస్టులా స్పందించారు: జగన్ మీద దాడిపై హర్షకుమార్

సీఎం, రాజప్ప రాజీనామా చెయ్యాలి, శివాజీని అరెస్ట్ చెయ్యాలి: మాణిక్యాల రావు డిమాండ్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్