Asianet News TeluguAsianet News Telugu

ఓటుతోనే రాజ్యం సిద్ధిస్తోంది:పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఓటు విలువపై హితబోధ చేశారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటిస్తున్న పవన్  ఓటు అనే ఆయుధాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. 

pawan kalyan says vote is most important to build a good nation
Author
Kakinada, First Published Nov 14, 2018, 8:51 PM IST

అనపర్తి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఓటు విలువపై హితబోధ చేశారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటిస్తున్న పవన్  ఓటు అనే ఆయుధాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. 

ప్రతీ కార్యకర్త అభిమాని జాబితాలో పేరు ఉందో లేదో ప్రతివారం చెక్ చేసుకోవాలని సూచించారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని కొంతమంది నమ్మితే ఓటు అనే ఆయధం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని జనసేన నమ్ముతుందని అదే జనసేన సిద్ధాంతమని పవన్ స్పష్టం చేశారు. 

జనసేన కార్యకర్తలు, అభిమానులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అలాగే ఇళ్లకు క్షేమంగా వెళ్లండని కోరారు. అమ్మానాన్న ఎదురుచూస్తుంటారని గుర్తు చేశారు. సైలెన్సర్లు తీసేయండి కానీ మన ఆనందం ఇంకొకరికి ఇబ్బంది కలిగించొద్దు అంటూ యువకార్యకర్తలకు పవన్ హితవు పలికారు.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై పవన్ ‘మగతనం’ కామెంట్స్

అప్పుడే మగతనం: జగన్ పై పవన్ వ్యాఖ్య, బాబుపైనా ఫైర్

చిన్నారికి నామకరణం, పవన్ శంకర్ గా పేరుపెట్టిన జనసేనాని

కాకినాడ : జనసేన పార్టీలో చేరిన కొత్త లీడర్లు (ఫోటోలు)

 

Follow Us:
Download App:
  • android
  • ios