జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తన మార్క్ స్టంట్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రోడ్‌షోలు, యాత్రలు, కవాతులతో జనంలోకి వెళ్లిన జనసేనాని ఇక నుంచి రైలు యాత్రలకు రెడీ అవుతున్నారు.

నవంబర్ 2వ తేదీన విజయవాడ నుంచి తునికి పవన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించనున్నారు. దీనిలో భాగంగా రైలు ఆగే ప్రతి ఒక్క స్టేషన్‌లో... వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటారు. ‘‘ సేనానితో రైలు ప్రయాణం’’ పేరుతో ఈ యాత్ర సాగనుంది.

2వ తేది మధ్యాహ్నం... 1.30 గం..లకు విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు.. అనంతరం నూజివీడులో మామిడి రైతులతో, ఏలూరులో సామాన్య ప్రజలతో, చిరు వ్యాపారులతో, తాడేపల్లి గూడెంలో చెరుకు రైతులతో, రాజమండ్రిలో టెక్స్‌టైల్స్ కూలీలతో, సామర్లకోటలో విద్యార్థులతో, అన్నవరంలో ఏటికొప్పాక హస్తకళాకారులతో పవన్ కల్యాణ్ సమావేశమవుతారు.

యాత్ర అనంతరం తునిలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతాయని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు జనసేన కార్యాలయంలో పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు.

అనంతరం ఉక్కుమనిషి, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పవన్ ఆయనకి నివాళులర్పించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో సంస్థానాలను విలీనం చేయడంలో ఆయన చూపిన ఉక్కు సంకల్ప బలమే ఈనాడు భారతదేశాన్ని ప్రపంచంలో అజేయ శక్తిగా నిలిపిందని పటేల్ సేవలను కొనియాడారు. 

తెలంగాణలో జనసేన పొత్తులు: తేల్చేసిన పవన్ కల్యాణ్

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదీ: మాయావతితో జరగని భేటీ

చంద్రబాబు ప్రభుత్వాన్ని సాయం కోరిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...

తెలంగాణలో 24 సీట్లకు పోటీ చేద్దామని అనుకున్నా: పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి