జనసేన ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుందని కొందరు అంటున్నారని, సీట్ల సర్దుబాటు కూడా అయిపోతే ఇప్పుడు కలవడం ఏమిటని ఇంకొందరు అంటున్నారని పవన్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ వ్యవహరించే తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మహా కూటమితో తెలంగాణలో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలపై ట్విట్టర్ లో ప్రతిస్పందించారు.
ఆ వార్తలు వింటుంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుందని కొందరు అంటున్నారని, సీట్ల సర్దుబాటు కూడా అయిపోతే ఇప్పుడు కలవడం ఏమిటని ఇంకొందరు అంటున్నారని పవన్ అన్నారు.
జనసేనకు ఎవరిక అండదండలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనమని ఆయన తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
Scroll to load tweet…
