ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీని పోటీకి దించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. జనసేన తెలంగాణ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆ ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తెలంగాణలో కనీసం 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణ నాయకులు తమ నేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ ఈ నెల 16వ తేదీన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.