విశాఖపట్నం: దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్ నాయుడి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. శిరోముండనం కేసులో అతనిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ పేరును దుర్వినియోగం చేసి మోసానికి పాల్పడినట్లు విశాఖపట్నంలోని పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, మహారాణిపేట పోలీసు స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి. నూతన్ నాయుడు 8297987395 ఫోన్ నెంబర్ నెంబర్ తో పీవీ రమేష్ పేరును వాడుకుంటూ ఎంత మందిని మోసం చేసి ఉంటారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. 

also Read: నూతన్‌నాయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు: మాజీ ఐఎఎస్ అధికారి పేరుతో ఫోన్లపై ఆరా

నూతన్ నాయుడి చేతిలో మోసపోయినవారు ముందుకు వస్తే మరిన్ని కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. ఆ నెంబర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 30 మంది అధికారులతో నూతన్ నాయుడు మాట్లాడినట్లు గుర్తించారు. వీరి వద్ద పీవీ రమేష్ పేరును వాడి ఏయే పనుల గురించి మాట్లాడరనేది కూడా తెలుసుకుంటున్నారు. 50కి పైగా ఫోన్ కాల్స్ కు చెందిన జాబితానను విశ్లేషిస్తున్నారు. నూతన్ నాయుడిపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై రౌడీషీట్ తెరిచే అవకాశం ఉంది.

Also Read: నూతన్ నాయుడు అరెస్ట్ వెనుక అసలు కథ ఇదా!?

నూతన్ నాయుడి భార్య మధుప్రియతో పాటు ఐదుగురిని తమ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కోర్టు అనుమతిస్తే విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.