విశాఖపట్టణం: దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన కేసులో అరెస్టైన బిగ్ బాస్ ఫేం నూతన్ నాయుడుపై పోలీసులు మరో కేసు  నమోదు చేశారు.

శిరోముండనం కేసులో ఈ నెల 4వ తేదీన నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.మాజీ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట 30 మందికి పైగా అధికారులకు ఫోన్లు చేసి పైరవీలకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

also read:శ్రీకాంత్ కి శిరోముండనం కేసులో నూతన్ నాయుడి అరెస్ట్: సీపీ

విశాఖపట్టణంలోని కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ సుధాకర్ కు నూతన్ నాయడు రిటైర్డ్ ఐఎఎస్ పీవీ రమేష్ ఫోన్ చేశాడు.  మరో వైపు గాజువాక పోలీసులకు కూడ మద్యం తాగి వాహనం నడిపిన కేసులో అరెస్టైన వ్యక్తిని విడిపించేందుకు నూతన్ నాయుడు పీవీ రమేష్ పేరుతో ఫోన్ చేశాడు. గాజువాక సీఐకి ఫోన్ చేసి మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తిని విడిపించాలని కోరాడు.

ఈ ఫోన్ సీఎం కార్యాలయం నుండి కాదని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఫోన్ లో ప్రస్తావించగానే నూతన్ నాయుడు ఫోన్ కట్ చేశారు.ఇలా మరికొందరికి పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడు ఫోన్ చేశాడని  పోలీసులు గుర్తించారు. ఈ విషయమై 30 మందికి పైగా ఫోన్లు చేశారని గుర్తించారు.

రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పేరుతో డాక్టర్ సుజాతకు నూతన్ నాయుడు ఫోన్ చేశాడు. ఈ విషయమై డాక్టర్ సుజాత పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.నూతన్ నాయుడు పీవీ రమేష్ పేరుతో ఎవరెవరవరికి ఫోన్ చేశాడనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.