Asianet News TeluguAsianet News Telugu

నూతన్ నాయుడు అరెస్ట్ వెనుక అసలు కథ ఇదా!?

నూతన్ నాయుడు రీసెంట్ గా ఓ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు. నూతన్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగటమే ఇందుకు కారణం. మొదట నూతన్ నాయుడు భార్య ప్రియదర్శిని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Real story behind the arrest of Nutan Naidu
Author
Hyderabad, First Published Sep 5, 2020, 3:04 PM IST

తెలుగు బిగ్ బాస్ సీసన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు రీసెంట్ గా ఓ కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యారు. నూతన్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగటమే ఇందుకు కారణం. మొదట నూతన్ నాయుడు భార్య ప్రియదర్శిని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఉడిపిలో నూతన్ నాయుడిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈ కేసులో మొదట్లో  నూతన్ ప్రమేయం లేదని అంతా భావించారు. 

అయితే తన భార్యను రక్షించే ప్రయత్నం నూతన్  నాయుడు చేయటమే కొంప ముంచిందని అంటున్నారు. అతని బార్యని  పోలీసులు అరెస్ట్ చేసిన రోజే నెట్ కాల్ ద్వారా ఆమెకు నూతన్ నాయుడు ఫోన్ చేసినట్టు పోలీసులు కనిపెట్టారు. అలాగే డాక్టర్ సుజాత, డాక్టర్ సుధాకర్ ,డాక్టర్ వాసుదేవ్ కు నూతన్ ఫోన్ చేసిన తాను సీఎంవో స్పెషల్ సెక్రటరీ పీవీ రమేశ్ నని చెప్పుకొని కేసును ప్రభావితం చేసే పనిచేయటం మరో విషయం అయ్యింది. 

డాక్టర్ సుధాకర్ కు అనుమానం వచ్చి ఏకంగా డైరెక్ట్ గా సీఎంవో కార్యదర్శి పీవీ రమేశ్ కు ఫోన్ చేయగా.. అసలు విషయం బయటపడింది. నూతన్ నాయుడు ఏకంగా ఏపీచీఫ్ సెక్రెటరీ ఏపీ సీఎంవో పేరుతో పోలీసులను వైద్యులను తప్పుదోవ పట్టించాడని తెలిసి పోలీసులు కాల్ డేటా ఆధారంగా కర్ణాటకలోని ఉడిపిలో పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇలా ఇంకా ఎవరినైనా బెదిరించాడా అన్నది విచారిస్తున్నారని సమాచారం. 

కేసు వివరాల్లోకి వెళితే...తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించింది. ఈ  ఘటన క్రితం శుక్రవారం చోటు చేసుకుందని చెప్తున్నారు. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 

విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్‌ భార్య మధుప్రియ ఫోన్‌ చేసి ‘నువ్‌ సెల్‌ఫోన్‌ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది.  

అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్‌ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.  
 
ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరినట్లు తెలుస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios