విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మణిక్రాంతి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మణిక్రాంతి హత్యలో పాల్గొంది నిందితుడు ప్రదీప్ తోపాటు మరో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. 

మణిక్రాంతిని హత్య చేయాలని ముందే ముగ్గురు ప్లాన్ వేసుకుని వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు. మణిక్రాంతిని ప్రదీప్ హత్య చేసేందుకు అతని సోదరుడు, బావ సహకరించారని తెలిపారు. 

మణిక్రాంతిని హత్య చేస్తున్న సందర్భంలో నిందితుడు ప్రదీప్ అన్న ప్రవీణ్ మణిక్రాంతి కాళ్లు పట్టుకుని కదలకుండా చేశాడని, అలాగే బావ శివ మణిక్రాంతి చేతులు పట్టుకున్నాడని వారిద్దరి సహకారంతో మణిక్రాంతిని ప్రదీప్ కత్తితో నరికి తలను పట్టుకుని పరారై అనంతరం కాలువలో పడేశారని స్పష్టం చేశారు. 

హత్య అనంతరం బావ, సోదరుడు హోండా యాక్టివ్ పై పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే మణిక్రాంతి హత్యకు సంబంధించి నిందితుడు ప్రదీప్, అతడి అక్క ఝాన్సీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇకపోతే మణిక్రాంతి తల దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు మెుండానికి అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు పోలీసులు మెుండాన్ని వెతికే పనిలో పడ్డారు. కాలువలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. తల దొరక్కపోతే కేసు విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

బెజవాడలో భార్యను చంపిన భర్త: ఇంకా దొరకని మణిక్రాంతి తల

దారుణం: భార్య తలను తీసుకెళ్తుండగా...