విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురంలో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. భార్యను నరికి చంపాడు భర్త. భార్య తలను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

విజయవాడకు చెందిన ప్రదీప్ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా మణిక్రాంతి పనిచేస్తుండేది. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొన్నారు.పెళ్లి చేసుకొన్న తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. దీంతో భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. కొంత కాలం క్రితం ప్రదీప్ పై ఆయన భార్య మణిక్రాంతి ఫిర్యాదు చేసింది.

వీరిద్దరి మధ్య విడాకుల కేసు కూడ చివరి దశలో ఉంది. మణిక్రాంతి  భర్తకు దూరంగా తల్లి వద్దే నివాసం ఉంటుంది. మణిక్రాంతి పెట్టిన కేసులో ప్రదీప్ బెయిల్ పై శనివారం నాడు విడుదలయ్యాడు. 

ఆదివారం నాడు ప్రదీప్ భార్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. భార్య మణిక్రాంతి తలను నరికాడు. మణిక్రాంతి తల్లి ముందే ఆమెను నరికి చంపాడు. మణిక్రాంతి తలను పట్టుకొని ప్రదీప్ సమీపంలోని మురికాల్వలో పారేశాడు.  మణిక్రాంతి తలను ప్రదీప్ తీసుకెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

తన కూతురి చావుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని మణిక్రాంతి తల్లి ఆరోపిస్తోంది.తన కూతురు మృతదేహంతో ఆమె ఆొందోళనకు దిగింది.పోలీసులతో మణిక్రాంతి కుటుంబసభ్యులు తీవ్ర వాగ్వాదానికి దిగారు.