పూజల పేరుతో వివాహితకు వల: భర్తకు షాకిచ్చిన మంత్రగాడు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 20, Aug 2018, 11:14 AM IST
Mother and daughter kidnapped in kurnool district
Highlights

కుటుంబసమస్యల్లో ఉన్న  తమను ఆదుకొంటామని నమ్మించి తన భార్య, కూతురును  రామస్వామి అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని   రంగస్వామి అనే వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశారు


కర్నూల్: కుటుంబసమస్యల్లో ఉన్న  తమను ఆదుకొంటామని నమ్మించి తన భార్య, కూతురును  రామస్వామి అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని   రంగస్వామి అనే వ్యక్తి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.

 కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడుకు చెందిన రామస్వామి అనే వ్యక్తి  తమ ఇంట్లో  శని ఉందని నమ్మించాడు.  ఈ శనిని తొలగించేందుకు ప్రతిరోజూ తమ ఇంటికి  వచ్చేవాడని రంగస్వామి పోలీసులకు ఇచ్చిన  ఫిర్యాదులో పేర్కొన్నాడు

రంగస్వామికి భార్య లక్ష్మీదేవీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  అయితే ప్రతి రోజూ తమ ఇంట్లో ఉన్న శనిని పారదోలేందుకు గాను పూజలు నిర్వహించేందుకు రామస్వామి వచ్చేవాడు.  ఈ క్రమంలో రంగస్వామి భార్య లక్ష్మీదేవితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

దరిమిలా  అయితే రామస్వామి చేసిన పూజల కారణంగా తాను కూడ అనారోగ్యానికి గురైనట్టు రంగస్వామి చెప్పారు.  అయితే శనివారం నాడు  రంగస్వామి ఓ స్థలానికి వెళ్లి పూజలు చేసి రావాలని సూచించాడన్నారు.

అయితే తాను అక్కడ పూజలు నిర్వహించి  ఇంటికి వచ్చేసరికి తన భార్య లక్ష్మీదేవి చిన్న కూతురును రామస్వామి తన బైక్‌పై తీసుకెళ్లాడని స్థానికులు చెప్పారని రంగస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు రామస్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈ వార్తలు చదవండి

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

అఫైర్: పెళ్లయ్యాక ప్రియుడితో జంప్, వద్దన్న భర్తకు షాక్

 

 

loader