తల్లైన మైనర్ బాలిక...పసికందును ఆస్పత్రిలో....

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 26, Aug 2018, 12:33 PM IST
Minor girl gives birth to baby
Highlights

అనంతపురం జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవలే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటనను మరువకముందే అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి సమీపానికి చెందిన ఓ బాలిక శుక్రవారం రాత్రి   శ్రీకంఠం సర్కిల్‌ దగ్గర పురుటి నొప్పులతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. 
 

అనంతపురం: అనంతపురం జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇటీవలే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రసవించిన ఘటనను మరువకముందే అలాంటి ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి సమీపానికి చెందిన ఓ బాలిక శుక్రవారం రాత్రి   శ్రీకంఠం సర్కిల్‌ దగ్గర పురుటి నొప్పులతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. 

శనివారం ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బాలిక. బిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికి బాలిక తల్లిదండ్రులు పసికందును ఆస్పత్రి ఆవరణలో వదిలిపెట్టి బాలికను తీసుకుని పరారయ్యారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో మైనర్ బాలిక ప్రసవించిందన్న విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు...మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ చిన్మయాదేవికి సమాచారం అందించారు. పీడీ ఆదేశాలతో ఐసీడీఎస్‌ అధికారులు పసికందును స్వాధీనం చేసుకున్నారు. 

పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూ విభాగంలో వైద్యులు పసికందుకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రసవించిన బాలికకు వివాహమైందా.. .లేదా అత్యాచారానికి గురై పసికందును ప్రసవించి వదిలేసి వెళ్లి పోయిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అనంతలో దారుణం...తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవం.

కర్నూల్ లో దారుణం....గర్భవతి అయిన మైనర్ బాలిక

మైనర్‌ బాలికకు గర్భం: టీచర్‌ను బట్టలూడదీసీ కొట్టిన స్థానికులు

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader