కర్నూల్ లో దారుణం....గర్భవతి అయిన మైనర్ బాలిక

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 23, Aug 2018, 12:07 PM IST
minor girl pregnant in kurnool
Highlights

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో పనిచేస్తున్న14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. రామలింగేశ్వరనగర్ లో నివాసం ఉంటున్న శివరామిరెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు వేరేచోట ఉండటంతో ఆమె శివరామిరెడ్డి ఇంట్లోనే ఉంటోంది. 

కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో పనిచేస్తున్న14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. రామలింగేశ్వరనగర్ లో నివాసం ఉంటున్న శివరామిరెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో 14 ఏళ్ల మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నాడు. బాలిక తల్లిదండ్రులు వేరేచోట ఉండటంతో ఆమె శివరామిరెడ్డి ఇంట్లోనే ఉంటోంది. 

ఆ బాలిక నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న శివరామిరెడ్డి ఆ బాలికను బెదిరించి కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. గర్భవతి అయిన విషయం బాలిక బంధువులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నిందితుడు శివరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్‌ బాలికను పనిలోపెట్టుకోవడమే కాకుండా, అఘాయిత్యానికి పాల్పడటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ లైంగిక వేధింపులు...

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

76 ఏళ్ల వయస్సులో చిన్నారులపై లైంగిక వేధింపులు: రాత్రి గదిలో ఇలా...

అనంతలో దారుణం...తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రసవం.

 

loader