వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఘటన ఆపరేషన్ గరుడలో భాగమేనని అనిపిస్తోందని ఏపీ మంత్రులు మంత్రి నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రముఖ నాయకుడిపై దాడి జరుగుతుందంటూ ఇటీవలే సినీనటుడు శివాజీ చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఘటన ఆపరేషన్ గరుడలో భాగమేనని అనిపిస్తోందని ఏపీ మంత్రులు మంత్రి నక్కా ఆనందబాబు, కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రముఖ నాయకుడిపై దాడి జరుగుతుందంటూ ఇటీవలే సినీనటుడు శివాజీ చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేశారు.
ఈ ఘటన చూస్తుంటే శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడను నమ్మాల్సి వస్తుందని తెలిపారు. విమానాల్లో భద్రత కేంద్రప్రభుత్వాల ఆధీనంలో ఉంటున్నందున అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. అనుమానాల నివృత్తికిసమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు.
దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుందని గతంలో జగన్ ఫోటోతో నిందితుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
మరోవైపు జగన్ పై దాడి విషయంలో వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న ఆరోపణలు సరికాదని మంత్రి ఆనందబాబు హితవు పలికారు. దాడులకు పాల్పడే పాల్పడే నీచమైన చరిత్ర తమకు లేదన్నారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇటువంటి దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు.
జైళ్లలో రిమాండ్‌లో ఉన్న ఖైదీలను చంపించిన ఘనత వైసీపీకే ఉందని ఆనందబాబు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేసి సానుభూతికి ప్రయత్నిస్తున్నారని, ఏ పార్టీ నాయకులు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపడుతోందని విచారణలో వాస్తవాలు కచ్చితంగా బయటకు వస్తాయని మంత్రి తెలిపారు.
అటు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సైతం జగన్ పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమేననిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ గరుడలో చెప్పినట్లు ఒక్కొక్కటి జరుగుతూనే వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఓ బలమైన రాజకీయ కుట్ర ఉందనిపిస్తోందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలపై పై స్థాయిలో కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రబలగాలున్నచోట ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ దాడి వెనుక ఎవరి ప్రోబ్బలం ఉందో ఎవరి కుట్రఉందో తేలుస్తామన్నారు. ఎవరు ఎవరిని రక్షించడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని నిలదీశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం ఉంటే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జగన్ పాదయాత్ర చేసేవారా అంటూ ప్రశ్నించారు కాల్వ శ్రీనివాస్. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అందర్నీ విచారిస్తామని కుట్రకోణాన్ని బయటపెడతామని తెలిపారు.
దాడిలో గాయపడిన వ్యక్తిని సిఐఎస్ఎఫ్ అధికారులు ఆస్పత్రికి తరలించాలి.కత్తికి విషం పూశారన్న అనుమానం వచ్చినప్పుడు విశాఖ ఆస్పత్రికి తరలించకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. క్షేమంగా ఉన్నారని తేలిన తర్వాతే హైదరాబాద్ పంపాలి.
దాడి జరిగిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఇంత తొందరగా ఎందుకు స్పందించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ స్పందించారని అయితే అంతే వేగంగా సీఐఎస్ఎఫ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు
జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు
జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్
వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)
వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి
