ఒక్క ఎంపీ స్థానం ఇవ్వండి: తెలంగాణ కాంగ్రెస్‌ను కోరిన సీపీఐ

పార్లమెంట్ ఎన్నికల్లో  ఒక్క ఎంపీ స్థానం కేటాయించాలని  సీపీఐ  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతుంది.

CPI Requests Telangana Congress For 1 MP Seat lns

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో  ఒక్క ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని  సీపీఐ రాష్ట్ర సమితి  తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరింది.  2023 నవంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు ఉంది.సీపీఐకి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కేటాయించింది.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి  సీపీఐ విజయం సాధించింది. 

also read:భవిష్యత్తుపై భరోసా: పార్లమెంట్ ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేస్తున్న కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో కూడ  సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుంది. అయితే  తమకు ఒక్క ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని సీపీఐ నేతలు  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు.ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి  స్థానాల్లో ఏదో ఒక స్థానం తమకు కేటాయించాలని సీపీఐ నేతలు కాంగ్రెస్ ను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గతంలో ఖమ్మం, నల్గొండ, భద్రాచలం పార్లమెంట్ స్థానాల్లో  సీపీఐ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

also read:యజమానిని చూసి గంతులేసిన కుక్క: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

అయితే  ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  తాము ప్రతిపాదించిన ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఏదో ఒక్క స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్టుగా  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. 

also read:వరంగల్ జిల్లాలో విషాదం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒంటరిగా పోటీ చేసింది. సీట్ల కేటాయింపు విషయంలో  కాంగ్రెస్ నాయకత్వం  వ్యవహరశైలితో  ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కానీ సీపీఐ(ఎం) ఒక్క సీటులో కూడ విజయం సాధించలేదు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీపీఐ(ఎం) కూడ తమ మిత్రపక్షమేనని  రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తమతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని కాంగ్రెస్ స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఐ(ఎం)లు భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.ఈ విషయమై  లెఫ్ట్ పార్టీల నేతలు వై.ఎస్. షర్మిలతో చర్చించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios