అమరావతి: అమరావతిలో చంద్రబాబునాయుడుతో పాటు ఆయన బంధువులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టుగా  ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

Also read:Year roundup 2019:పారిశ్రామిక ప్రగతి వైపు ఏపీ అడుగులు, కొత్త పోర్టుల నిర్మాణం వైపు

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ వియ్యంకుడి కొడుకుకు 490 ఎకరాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆ తర్వాత ఈ భూములను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Also read:Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

ఏపీలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతోనే  ఏపీ సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జీఎన్ రావు కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టుగా తెలిపారు.

also readyear roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు...

వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకుగాను  హైపవర్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

తన కుటుంబంపై కూడ ఆరోపణలు చేశారని ఈ విషయమై నిరూపించాలని తాము సవాల్ విసిరినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఇంతవరకు నిరూపించలేకపోయారని బొత్స తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో తాము చేసిన పలు ఆరోపణలపై విశాఖ భూములపై ఒక్క సిట్ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.

also read: Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

తమ ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబునాయుడు మాదరిగా తాము వ్యవహరించబోమని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అమరావతి పరిధిలో అవకతవకలకు పాల్పడి ఆ తర్వాత విచారణ చేసుకోవాలని సవాల్ విసురుతారా అని ఆయన బాబుపై మండిపడ్డారు.