Asianet News TeluguAsianet News Telugu

Year roundup 2019:పారిశ్రామిక ప్రగతి వైపు ఏపీ అడుగులు, కొత్త పోర్టుల నిర్మాణం వైపు

ఏపీ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకొన్న నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతి వైపు ఏపీ రాష్ట్రం దూసుకుపోతోంది.

Ys jagan starts new policies to boost industrial growth
Author
Amaravathi, First Published Dec 29, 2019, 3:38 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ సరళీకృత విధానాలకు శ్రీకారం చుట్టారు. పారిశ్రామిక ప్రగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జగన్ సర్కార్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే రాష్ట్రంలో పెట్టుబడులపై విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు నిర్వహించింది. 

Also read:Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

పెట్టుబడుల అంశంలో కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షించడం కోసం విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు నిర్వహించింది.

 ఇందులో సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  వివిధ దేశాల విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులతో రమ్మని స్వాగతం పలికారు. పారదర్శక పాలన మాదని ఒక్క దరఖాస్తుతో కంపెనీలకు అనుమతులు లభిస్తాయన్నారు. 

also readyear roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు...

రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులను తయారు చేస్తామని ఆ నైపుణ్యాభివృద్ధికి అయ్యే వ్యయాన్ని, నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

also read: Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

ఇప్పుడు వచ్చిన పెట్టుబడులే గాక రానున్న కాలంలో మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. దీనికితోడు సూక్ష్మ, చిన్న, మధ్య(ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలు పుంజుకోవటానికి ప్రభుత్వం వైయస్‌ఆర్‌ నవోదయం పేరుతో చేయూత కూడా అందిస్తోంది. 

రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న టాప్‌ టెన్‌ సంస్థలు

కంపెనీ        ఉత్పత్తి         పెట్టుబడి (కోట్లలో)                  ఉపాధి లక్ష్యం

ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌    స్టీలు            రూ.15,000 కోట్లు    25,000
పోస్కో         స్టీలు             రూ. 35,000 కోట్లు    6000
జేఎస్‌డబ్లు్య     స్టీలు            రూ.14,000 కోట్లు    –––
చింగ్‌షాన్‌ హోల్డింగ్స్‌    స్టీలు            రూ.14,000 కోట్లు     10000
ఇంటెలిజెంట్‌ సెజ్‌ లి.,    పుట్‌వేర్‌                          రూ.700 కోట్లు        10,000
ఏటీసీ టైర్స్‌ ప్రై.లి.,    టైర్లు            రూ.1152 కోట్లు    1000
గ్రాసిం ఇండస్ట్రీస్‌    క్లోరో ఆల్కాలి        రూ.2700 కోట్లు    1300
పీఎస్‌ఏ వాల్‌సిన్‌     చిప్స్‌–గృహాపకరణాలు    రూ.735 కోట్లు          –––
పానాసోనిక్‌     ఎలక్ట్రానిక్స్‌                                               రూ.1000 కోట్లు    3000            
ఫిలిఫ్‌ కార్బన్‌    బ్లాక్‌ కార్బన్‌             రూ.600 కోట్లు     500

ఈ కంపెనీలే కాకుండా మరో 19 సంస్థలు రూ.15,648 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. తద్వారా 25,967 మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్నాయి. 

8 యూనిట్స్‌ ఇప్పటికే రూ.7,916 కోట్లు పెట్టుబడులతో 4,086 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ సంస్థలు ట్రైల్‌ ప్రొడక్షన్‌ దిశగా వెళ్లాయి కూడా.మరో 8 యూనిట్స్‌ రూ.8,663 కోట్లతో 14,205 మందికి ఉపాధి కల్పించనున్నాయి. 

ఇప్పటికే మొషినరీని తీసుకువచ్చి పనులు జరుగుతున్నాయి. ఇంకో 8 యూనిట్స్‌ రూ.2,422 కోట్లతో 10,457 మందికి ఉపాధి ఇవ్వనున్నాయి. ఈ కంపెనీలు సివిల్‌ వర్క్‌ స్టేజ్‌లో ఉన్నాయి. 

కొత్తగా పోర్టులు

ప్రస్తుతం రాష్ట్రంలో 972 కి.మీ తీర ప్రాంతంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 

మచిలీపట్నం పోర్టు నిర్మాణంకోసం డీపీఆర్‌ తయారుచేసే బాధ్యతను రైట్స్‌ సంస్థకూ అప్పగించింది. దీనిపై ఇటీవల జరిగిన కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.  అపార ఉద్యోగావకాశాల కల్పన, సామాజిక–ఆర్థిక పరిపుష్ఠిని సాధించడమే లక్ష్యంగా అవినీతి రహిత, పారదర్శకపాలనతో ఉరకలు వేస్తోంది.

also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

 దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తన వాటా పెంచేందుకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం 135 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదిగినప్పటికీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి పారిశ్రామిక రంగం వాటా. 23 శాతంతో అత్యల్పంగా ఉంది,  దీన్ని పెంచడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. 

పెట్టుబడిదారులు భారతదేశంలో తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ని ఎన్నుకోవటానికి, ఉదహరించడానికి రాజకీయ స్థిరత్వం, సముద్ర ఓడరేవుల ద్వారా ఆగ్నేయ ఆసియా మార్కెట్లకు ప్రవేశం, రోడ్‌–రైల్‌ కనెక్టివిటీ, ఉచిత భూమి బ్యాంక్‌ అపారంగా ఉండడం వంటివి  ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఏ రాష్ట్రానికి లేని 974 కిలోమీటర్ల, దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. 4 పోర్టులతో సౌత్‌ ఈస్ట్‌ ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఏపీ విరాజిల్లుతోంది.

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మాత్రమే దేశంతో పాటు, ప్రపంచానికి అనుసంధానించే 6 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఇన్ని విమానాశ్రయాలు ఉన్న ఏకైక రాష్ట్రం మనదే.

రాష్ట్రంలోని  ప్రతి కుటుంబం నుండి దాదాపు ఒక ఇంజనీర్‌ తయారు అవుతున్నారు. భారతదేశంలో 25% పైగా ఐటి వర్క్‌ఫోర్స్‌తో పాటు యుఎస్‌లో పనిచేస్తున్న సుమారు 25% మంది కూడా భారతీయులే.

గుడ్డు, మాంసం, పాలు, రొయ్యలు, బారియెట్స్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉంది. వైవిధ్యమైన పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశాలను సూచిస్తూ వాణిజ్యాన్ని నడిపించడానికి , రాష్ట్రం అందించే ఎగుమతి సామర్థ్యానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.

విదేశీ, దేశీయ పరిశ్రమలను ఆకర్షించడానికి దేశంలో ఉత్తమమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ‘డిప్లమాటిక్‌ అవుట్‌ రీచ్‌’ పేరుతో అవగాహన సదస్సును నిర్వహించింది. 34 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్‌ జనరల్స్‌ను ఒకే వేదికపైకి తెచ్చి  ఏపీలో  పెట్టుబడి అవకాశాలపై చర్చా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

 వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి అత్యున్నత స్థాయిలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, చైనా వంటి అనేక దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సందర్శించి ప్రభుత్వంతో అనేక అంశాలపై చర్చించారు.

పారిశ్రామికీకరణపై పురోగతి  

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెయ్యికి పైగా కంపెనీలకు ఏపిఐఐసి ద్వారా భూమిని కేటాయించడం జరిగింది. మరెన్నో కీలక కంపెనీలు ప్రభుత్వంతో మరో వైపు చర్చలు జరుపుతున్నాయి. 

ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు సమాన ప్రయోజనాలను అందే అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని,  ఆర్థిక అభివృద్ధిని విస్తృతం చేయడానికి ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహక వ్యూహాన్ని అనుసరిస్తోంది.

 అనంతపురంలో ఆటోమోటివ్‌ తయారీని, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, విశాఖపట్నంలో ఐటి , తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో పెట్రో కెమికల్స్‌ వంటి భారీ పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

ఇచ్చిన మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రిగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నారు. ఎన్నికల కోసం కాలయాపన చేయకుండా పాలన మొదలైన 6 నెలల్లోనే 80శాతం హామీలను పూర్తి చేస్తూ, అనుకున్నవన్నీ చేసుకుంటూ ముందుకు వెళుతుండడం ఆయన అంకితభావానికి నిదర్శనం. 

కడపలోని జమ్మలమడుగు మండలం వద్ద డిసెంబర్‌ నెల 23వ తేదీన ఎపి హై గ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌కు తాజాగా సీఎం  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పునాది వేశారు. ఈ ప్రాజెక్టుతో 25 వేల మంది యువతకు ఉపాధి సామర్థ్యంతో పాటు రూ.15,000 కోట్ల రూపాయల పెట్టుబడిని అంచనా వేస్తోంది.

ప్రభుత్వం రూ.1000 కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయంతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 3000 మందికి పైగా ఉపాధి కల్పించడానికి అనంతపురంలోని ‘వీరవాహన ఉద్యోగ్‌’ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూమిని కేటాయించింది.

 ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో... లో, హై–స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను తయారు చేసే  చైనా ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ  ముందుకు వచ్చింది. 25 – 30 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో బ్యాటరీలు, మోటార్లు, కంట్రోలర్‌ల తయారీ కోసం కంపెనీ  ఆటోమొబైల్‌ ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సమీపంలో భీమడోలు గ్రామంలో , సింజెంటా.. ఒక ఇన్నోవేషన్‌ – లెర్నింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పురుగుమందుల వాడకంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పించడమే ఈ కేంద్రం ఏర్పాటు వెనకున్న లక్ష్యం. పంటలకు నష్టం జరగకుండా తెగుళ్ళను గుర్తించడంలో సహాయపడటానికి డ్రోన్స్‌ వంటి డిజిటల్‌ సాధనాల వాడకాన్ని కూడా వారు ఉపయోగించారు.

 భారతదేశంలో ఊబర్‌ తన రెండవ  సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఓడరేవు నగరం విశాఖపట్నం కేంద్రంగా సేవారంగంలో 500 మందికి పైగా ఉద్యోగాలను తీసుకువచ్చింది.

పోర్టుల ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి 

పోర్టుల ద్వారా రాష్ట్రంలో లాజిస్టిక్స్, కనెక్టివిటీని మెరుగుపరచడానికి.. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, ఓడరేవు, కాకినాడ వంటి ఐదు కొత్త ఓడరేవులను అభివృద్ధి చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  ప్రధాన కేంద్రాలను అనుసంధానం చేస్తూ హైవేలు, రైల్వేలతో మల్టీ–మోడల్‌ లాజిస్టిక్స్‌ హబ్‌లు, లోతట్టు జలమార్గ రవాణా కోసం బకింగ్‌హామ్‌ కాలువ పునరుద్ధరణ,  నీటి సరఫరా భరోసా కోసం డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.

వస్త్రాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌ రంగాల క్లస్టర్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్‌ విస్తరణకు అనువైన వాతావరణం ఉంది. పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుకు, విస్తరించేందుకు కావాల్సిన పర్యావరణ వ్యవస్థ ఉండడం ఏపీకి మాత్రమే సొంతం.

గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణలో, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసం,  ఆదాయాన్ని పెంచేందుకు,  సమతుల్యతను  పాటించేలా ఎంఎస్‌ఎంఈ యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది.

 ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎస్‌ఎంఈల కోసం ప్రభుత్వం ప్లగ్‌ అండ్‌ ప్లే పార్కులను అభివృద్ధి చేస్తోంది, మౌలిక సదుపాయాల అభివృద్ధి , ఆర్థిక సమాభివృద్ధితో రాష్ట్ర ప్రభుత్వ వృద్ధిరేటుని సాధించేందుకు ఈ ఎంఎస్‌ఎంఈ పార్కులు దోహదపడతాయి. తద్వారా అన్ని జిల్లాల్లో యువతకు సమాన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.

తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లను పునరుద్ధరించడానికి , అలాగే ఎంఎస్‌ఎంఈల రుణాల వన్‌ టైమ్‌ రీ – స్ట్రక్చరింగ్‌ కు వీలుగా  ప్రతిష్ఠాత్మక  ‘‘వైయస్‌ఆర్‌ నవోదయం’’ పథకాన్ని ప్రారంభించింది.

సులభతర వాణిజ్యాన్ని (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) మెరుగు పరిచేందుకు

ఈఓడీబీ కింద, సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ అభివృద్ధి చేయబడింది. ఇది  పెట్టుబడిదారులందరి అవసరాలను తీర్చే వన్‌ స్టాప్‌ షాప్‌గా ఉపయోగపడుతుంది.21 పనిదినాలలోపు పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని ఆమోదాలు, అనుమతులు అందించేందుకు ప్రభుత్వంలోని 23 శాఖలు సమన్వయంతో పని చేస్తాయి.

 75 వేర్వేరు సేవలకు 27  సంస్థలు,  29 ప్రీ–ఆపరేషన్లు, 15 పునరుద్ధరణలు, 4 ఇతర సేవలు ఎస్డిపిలో అందుబాటులో ఉన్నాయి.ఇంకా, జిల్లా స్థాయి ఈఓడీబీ సిద్ధంగా ఉంది. ఒకసారి అమలు చేస్తే ఇది 8 ప్రాంతాలను 218 సంస్కరణలతో జిల్లా స్థాయి సేవలన్నీ ఒకే విండోలో కవర్‌ చేస్తుంది.

ఆర్థిక పురోగతికి పారిశ్రామిక కారిడార్లు 

విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) భారతదేశపు మొట్టమొదటి తీర కారిడార్‌ అయిన ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఈసీఈసీ)లో కీలక భాగం.ఉత్పాదక రంగాలను పెంచడం, కార్మిక ఉత్పాదకతను మెరుగుపరచడం, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడం వీసీఐసీ(వీసీఐసీ) అభివృద్ధి కార్యక్రమం యొక్క ముఖ్యోద్ధేశ్యం. 

 లోహ–లోహ రహిత ఖనిజాలు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ–ప్రాసెసింగ్, ఫుడ్‌–ప్రాసెసింగ్, ఆటోమొబైల్‌ – ఆటో కాంపొనెంట్స్, పునరుత్పాదక విద్యుత్, వస్త్ర, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ రంగాలు కారిడార్‌లో కీలకమైన పారిశ్రామిక రంగాలుగా గుర్తించబడ్డాయి.విశాఖపట్నం, కాకినాడ, గన్నవరం–కంకిపాడు, శ్రీకాళహస్తి–ఏర్పేడు అనే నాలుగు పారిశ్రామిక నోడ్లను వీసీఐసీ కింద అభివృద్ధి చేయాల్సి ఉంది.

 చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సిబిఐసి) భారత ప్రభుత్వ మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటి. ఇది దేశ జిడిపిలో ఉత్పాదక రంగం వాటాను పెంచడం , స్మార్ట్‌ సుస్థిర నగరాలను సృష్టించే ముఖ్య ఉద్దేశ్యంతో రాష్ట్రం మీదుగా వెళ్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యవంతమైన ప్రజా రవాణా వెసులబాటు, నిర్వహణ, పుష్కలంగా నీరు, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ ఉంటుంది.

సిబిఐసి ప్రాజెక్ట్‌ కింద, ఫేజ్‌ –1 లో మూడు నోడ్లు గుర్తించబడ్డాయి; కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ నోడ్‌ (కెపిటిఐన్‌) కృష్ణపట్నం నౌకాశ్రయానికి దక్షిణాన 12,000 హెక్టార్ల పారిశ్రామిక అభివృద్ధిగా ఉన్న ఒక ప్రణాళికాబద్ధమైన ప్రాంతం. అదనంగా, కడప, అనంతపురంలోని హిందూపూర్లను పారిశ్రామిక నోడ్లుగా అభివృద్ధి చేస్తున్నారు.

అభివృద్ధి ఫలాలు దిశగా..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేలా...ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అడుగులు వేస్తోంది. అన్ని ప్రాంతాలలోని స్థానిక ప్రజలను,పెట్టుబడిదారులను పారిశ్రామిక వృద్ధిలో ప్రత్యేక భాగస్వాములుగా చేయడం, ఏపీ సమగ్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం,  అభివృద్ధితో అనుసంధానించే అభివృద్ధి యొక్క స్వంత ఒత్తిడిని సృష్టిస్తోంది. భూమి కేటాయింపులు, అనుమతుల వంటి అంశాలలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పారిశ్రామికీకరణలో అనుకున్న లక్ష్యాలను సాధించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios