హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తమ వారిని కడసారి చూసుకొనేందుకు అవకాశం కల్పించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

Also read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

ఇదిలా ఉంటే పసుపు బోర్డు కంటే మించి  ప్రయోజనం కలిగేలా కేంద్రం నుండి జనవరిలో ప్రకటన ఉండే అవకాశం ఉందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ వారంలో ప్రకటించారు. మరో వైపు పసుపు రైతులు ఆందోళనకు సిద్దమౌతున్నారు.

దిశ నిందితులతో  సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో  నిందితులు  పారిపోయే ప్రయత్నం చేసే సమయంలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ నిందితుల మృతదేహాలకు ఈ నెల 6వ తేదీన అంత్యక్రియలు చేయాలని పోలీసులు భావించారు. అయితే ఈ విషయమై హైకోర్టు కీలకమైన ఆదేశాలను  జారీ చేసింది. మృతదేహాలను భద్రపర్చాలని 6వ తేదీన ఆదేశించింది.

also read:ప్రధానమంత్రి గాల్లో లెక్కలు కట్టే మనిషి కాదు... ఇది తథ్యం: ధర్మపురి అరవింద్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు వరుసగా విచారణ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన దిశ కుటుంబసభ్యులతో కూడ జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు విచారించారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై  జాతీయ మానవ హక్కుల సంఘానికి  సైబరాబాద్ పోలీసులు నివేదికను  సమర్పించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరు మాసాల్లో విచారణను పూర్తి చేసి నివేదికను ఇవ్వాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.

వచ్చే వారంలో కమిటీ తెలంాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. దిశ నిందితుల మృతదేహాలను  గాంధీ ఆసుపత్రిలో భద్రపర్చాలని  తెలంగాణ హైకోర్టు ఈ నెల 14వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు  కూడ మృతదేహాలను భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్  తర్వాత సోషల్ మీడియాలో సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్‌ (వీసీ సజ్జనార్)పై ప్రశంసలు కురిపించారు. సజ్జనార్ సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ నెల 14వ తేదీన సజ్జనార్  తన ఫ్యామిలీతో కలిసి లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.  సజ్జనార్‌తో స్థానికులు సెల్పీలు తీసుకొన్నారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు పసుపు బోర్డు కోసం చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ రెండు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. జనవరి మాసంలో పసుపు రైతులకు ఆనందించే ప్రకటన కేంద్రం చేసే అవకాశం ఉందని అరవింద్ ప్రకటించారు. పసుపు బోర్డు కంటే మేలైన పథకం కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని  నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించారు.

మరోవైపు నిజామాబాద్ కు చెందిన  పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పాదయాత్ర చేయాలని తలపెట్టారు. ఆరు మాసాల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేతలు  ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేదని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.