ఆఫీస్‌కు పిలుస్తారనుకున్నా.. కానీ ఏకంగా ఇంటికే రమ్మన్నారు: జగన్‌పై చిరంజీవి ప్రశంసలు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి. జగన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరచచిపోనని అన్నారు చిరు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి. జగన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరచచిపోనని అన్నారు చిరు.
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలకు మద్ధతు తెలుపుతున్న మెగాస్టార్ ... సైరా సినిమా విడుదల సందర్భంగా సతీమణితో కలిసి తాడేపల్లి వెళ్లారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో కలిసి లంచ్ చేశారు చిరంజీవి దంపతులు. వైఎస్ కుటుంబంతో తనకు తొలి నుంచి మంచి సాన్నిహిత్యం ఉందని, సాక్షి ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నట్లు చిరు గుర్తుచేసుకున్నారు.
Also Read:ఏపి లాక్ డౌన్... రంజాన్ నెల సందర్భంగా ముస్లీంలకు ప్రత్యేక వెసులబాట్లు
అంతేకాకుండా ఆ ఛానెల్‌లో జరిగిన వివిధ అవార్డు ఫంక్షన్‌లకు తాను హాజరయ్యానని.. ఈ సందర్భంగా వైఎస్ భారతి ఇచ్చిన గౌరవం తనను చాలా ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు.
తర్వాతి కాలంలో ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో పాల్గొనాల్సందిగా తనకు ఆహ్వానం వచ్చిందని చిరు చెప్పారు. అయితే అనివార్య కారణాల వల్ల తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు.
అయినప్పటికీ తాను జగన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు ఆయన చెప్పారు. తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను పలువురు వైసీపీ నేతలకు చూపించాలని అనుకున్నానని.. ఆ సమయంలోనే జగన్ అపాయింట్‌మెంట్ అడిగానని చిరంజీవి పేర్కొన్నారు.
Also Read:ఏపీలో వేయికి చేరువలో కరోనా కేసులు: మరో ఇద్దరు మృతి, మొత్తం 29
ఆ సమయంలో జగన్ తనను కార్యాలయానికి పిలుస్తారని అనుకున్నానని.. కానీ ఆయన ఏకంగా ఇంటికే తనను పిలిచారని చిరు గుర్తుచేసుకున్నారు. దీంతో తాను, సురేఖ తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లామని ఆ సమయంలో జగన్-భారతి ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చిరంజీవి తెలిపారు.
అదే సమయంలో వైసీపీలోకి ఆహ్వానం వస్తే వెళతారా..? అన్న ప్రశ్నకు చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, కానీ ఎవరు మంచి చేసినా తాను అభినందిస్తానని ఆయన స్పష్టం చేశారు.