Asianet News TeluguAsianet News Telugu

ఏపి లాక్ డౌన్... రంజాన్ నెల సందర్భంగా ముస్లీంలకు ప్రత్యేక వెసులబాట్లు

లాక్ డౌన్ సమయంలోనే రంజాన్ నెల ప్రారంభమవుతుండటంతో ఏపిలోని ముస్లీంలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించిన జగన్ ప్రభుత్వం. 

AP  Lockdown...  Ramadan month special cionvention in AP
Author
Amaravathi, First Published Apr 24, 2020, 1:07 PM IST

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే ముస్లీంలు అతి పవిత్రంగా భావించే రంజాన్ నెల ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో ముస్లీం కమ్యూనిటీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక  వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపి వక్ఫ్ బోర్డు ఓ ప్రకటన వెలువరించింది.

ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలివే:

1. 24×7 విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుంది.

2. ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చూస్తుంది.

3. కూరగాయలు, పండ్ల ఫలాలు, మిగతా అన్ని నిత్యవసర సరుకులు ఉదయం 10 గంటల వరకు  అందుబాటులో ఉంటాయి.

4. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి పండ్ల ఫలాలు,డ్రై ఫ్రూట్స్ అమ్ముటకు అనుమతి ఇచ్చి ముస్లిం సోదర సోదరీమణులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది.

5. సామాజిక దూరం పాటిస్తూ ఉదయం 3 - 4.30 వరకు సాయంత్రం 5.30 - 6.30 వరకు దాతలు ఎవరైనా పేదలకు దానం చేయుటకు బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

6. మీ నగరాలలో కొన్ని హోటల్స్ ను గుర్తించి సహరి ఇఫ్తార్ సమయాలలో మాత్రమే భోజనం మరియు ఇతర తినబండారాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది.

7. క్వారన్ టైన్ లో ఉన్న ముస్లిం లకు సహా మరియు ఇఫ్తార్ సమయంలో వ్యాధి నిరోధక శక్తి మరియు సామర్ధ్యాన్ని  పెంచే ఆహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది.

8. ఇమామ్ మరియు మౌజన్ లకు 5 పూటలా నమాజులు చదివించి మస్జీద్ నుండి ఇంటికి మరియు ఇంటి నుండి మస్జీద్ కి వెళ్లే వెసులుబాటు కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

పైన ఉన్న ప్రభుత్వ సూచనలను ప్రతి మస్జీద్ లో బ్యానర్ రూపంలో ప్రదర్శించాలని ప్రభుత్వం ముస్లీం మతపెద్దలు, మసీద్ నిర్వహకులకు సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios