మాకు ఆ దమ్ముంది: పవన్‌పై జగన్ వ్యాఖ్యల మీద నాగబాబు

Mega brother Nagababu reacts on Ys jagan comments
Highlights

 పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తుల వెనుక ఎలాంటి రాజకీయ శక్తులున్నాయో  తమకు తెలుసునని  పవన్ కళ్యాణ్‌ సోదరుడు మెగా బ్రదర్  నాగబాబు చెప్పారు.  తన సోదరుడిపై వ్యక్తిగత విమర్శలు చేసిన అందరి జాతకాలను పవన్ కళ్యాణ్ బయటపెడతాడని నాగబాబు హెచ్చరించారు.

హైదరాబాద్: పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తుల వెనుక ఎలాంటి రాజకీయ శక్తులున్నాయో  తమకు తెలుసునని  పవన్ కళ్యాణ్‌ సోదరుడు మెగా బ్రదర్  నాగబాబు చెప్పారు.  తన సోదరుడిపై వ్యక్తిగత విమర్శలు చేసిన అందరి జాతకాలను పవన్ కళ్యాణ్ బయటపెడతాడని నాగబాబు హెచ్చరించారు.

వపన్ కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  వ్యక్తిగత విమర్శలు చేశారు. కార్లను మార్చినట్టుగానే భార్యలను మారుస్తాడని పవన్‌పై ఆయన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై నాగబాబు  తీవ్రంగా స్పందించారు.

రాజకీయంగా తన సోదరుడిని ఎదుర్కొనే దమ్ము లేకపోవడంతోనే  వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.  తన  సోదరుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు.పర్సనల్ లైఫ్‌ గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకొనే దమ్మున్న వ్యక్తి  తన సోదరుడని పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చెప్పారు.

సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో సినిమాలను వదులుకొని ప్రజా సేవ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని ఆయన చెప్పారు.  తాము చెప్పిన మాటలను కూడ పవన్ వినలేదన్నారు.  తప్పులు చేస్తే ఒప్పుకొనే దమ్ము పవన్ కు ఉందన్నారు. కానీ, తప్పులు చేస్తే ఒప్పుకొనే దమ్ము మీకు ఉందా అని పవన్ ను విమర్శిస్తున్న పార్టీల నేతలను నాగబాబు ప్రశ్నించారు.

ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తే  అందరూ దొరుకుతారన్నారు.  ఇన్ని విమర్శలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా  ఉన్నాడన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని  చేతకానితనంగా భావించకూడదని ఆయన కోరారు. తాను ఈ రకంగా మాట్లాడడం కూడ పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదన్నారు.

 పవన్ కు తెలియకుండానే తాను ఈ మాటలు మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఈ విషయాలను బహిరంగంగా వ్యక్తం చేసినందుకు తన సోదరుడు తనపై కోప్పడినా తనకు నష్టం లేదన్నారు.పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయించిన రాజకీయ శక్తుల జాతకాలను త్వరలోనే పవన్ కళ్యాణ్ బయటపెడతాడని నాగబాబు హెచ్చరించారు.


ఈ వార్తలను చదవండి:జగన్‌తో ఫోటోపై దుమారం: పవన్‌ కు ఫ్యాన్‌ని, మీ ఇంట్లో వాళ్లకే జరిగితే....

ఎవరి వ్యక్తిగత జీవితాల్లో... జగన్‌కు పవన్ కౌంటరిదే
పవన్‌ భార్యలే తేల్చుకోవాలి: జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

సమాధానమిస్తా: జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన

loader