మెగా బ్రదర్ నాగబాబు మరోసారి జగన్ పై విమర్శలు చేశారు. మై ఛానల్ నా ఇష్టం అంటూ యూట్యబ్ ఛానెల్ మొదలుపెట్టిన ఆయన ఇప్పటికే.. లోకేష్, జగన్ లను టార్గెట్ చేస్తూ వీడియోలు విడుదల చేశారు. తాజాగా మరోసారి జగన్ పై విమర్శలు చేశారు. గతంలో జగన్ మాట్లాడిన వీడియోలు రెండింటిని ప్లే చేశారు.
 
ఒక వీడియోలో జగన్.. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు తీయాలా అని ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా ఉండగా.. మరో దాంట్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే.. మన ప్లేట్లో మనం బిర్యానీ తినొచ్చు అనే కామెంట్స్ చేశారు. వాటిని నాగబాబు ప్లే చేశారు. 

అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ఎవరు ఎటు చూసినా.. మన జగన్మోహన్ రెడ్డిగారు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలిచిన ఆంధ్రప్రదేశ్ ని ఒక బిర్యానీ ప్లేట్ లాగా చేసుకొని అందులోని బిర్యానీలాగా తినేద్దామని ఆయన ప్లాన్ చేశారు. ఆయన తోపాటు.. ఆయన ముఖ్య అనుచరులు కూడా. ఒక వీడియోలో డబ్బు తీయాలా..అని అన్నారు. ఎందుకు తీయాలా డబ్బులు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డబ్బులు సరిపోతాయి కదా. ఆ మాత్రం డబ్బులు సరిపోతాయి కదా. అయినా.. డబ్బులు తీయాల అని అన్నారంటే.. జగన్ డబ్బులు తీసే విషయంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో అర్థమౌతోంది.’’ అని నాగబాబు కామెంట్స్ చేశారు. 

‘‘ ఇంకో వీడియోలో జగన్ .. ఒక రెండేళ్లు ఓపిక పట్టండి. మన రాజ్యం వస్తది. మీకు పోయిందానికి నాలుగురెట్లు సంపాదించి పెట్టే పూచి నాది అని అన్నారు.దీనికి అర్థం ఏంటి? మొన్న నేను జగన్ పై విడుదల చేసిన వీడియోలో.. ఆయనను నేను సరిగా అర్థం చేసుకోలేదని కొందరు కామెంట్స్ చేశారు. మరి ఈ వీడియోకి అర్థం ఏంటో చెప్పాలి. గత ఎన్నికల్లో ఓ వ్యక్తి రూ.15కోట్లు ఖర్చు పెట్టి పోగొట్టుకున్నారనుకుంటే.. వైసీపీ అధికారంలోకి వస్తే.. దానికి 4రెట్లు అంటే.. రూ.60కోట్లు సంపాదించుకునేలా చేస్తాడా? ఆయన ఏం చెబుతున్నారంటే.. ఖర్చు పెట్టండి.. గెలవండి. గెలిచాక.. ఏపీకి బిర్యానీ ప్లేట్ లాగా చేసుకొని తినేద్దాం అన్నాడు. ఎంత క్లారిటీ ఉన్న నాయకుడో’’ అంటూ కామెంట్స్ చేశారు. 
 

read more news

లోకేష్ బాబు రైట్.. నాగబాబు మరో సెటైరికల్ వీడియో

ఓ రేంజ్ ఎదవ.. జగన్ పై నాగబాబు కామెంట్స్

రూట్ మార్చిన నాగబాబు..లోకేష్ బాబు గ్రేట్ అంటూ...