మొన్నటి వరకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై విమర్శల వర్షం కురిపించిన మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు రూట్ మార్చిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత యూట్యూబ్ అకౌంట్ ద్వారా రాజకీయాలపై, కొందరు నాయకులపై తనకు ఉన్న అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నట్లు తెలిపిన నాగబాబు.. తొలుత లోకేష్ ని టార్గెట్ చేశారు. లోకేష్ గతంలో మాట్లాడిన వీడియోని చూపించి.. లోకేష్ బాబు గ్రేట్ అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేశారు.

తాజాగా.. జగన్ కి సంబంధించిన ఓ వీడియోని ప్లే చేసి.. ఆయనపై కామెంట్స్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘ఈ మధ్య మన ప్రతిపక్ష ప్రియతమ నేత శ్రీ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ ఛానల్ యాంకర్ రజినీకాంత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సమాధానం చాలా నిజాయితీగా ఇచ్చారు. మన మనసులో ఉన్న భావం ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ. 

ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. ‘ఎందుకు మీరు ఆ చంద్రబాబు గారిని ఈ మాటలు అడగరు? అడగాలి అంటే ఆయన చేసిన అవినీతి అట్లుంది. అక్కడ దాని మీద ఎంక్వయిరీ ఏ స్టేజిలో జరుగుతుందో నాకు అయితే తెలీదు. బహుశా నా స్టేజి కూడా దాటిపోయి కోర్టు స్టేజి కూడా దాటిపోయి’ అని అన్నారు.

దీనిపై నాగబాబు మాట్లాడుతూ.. ‘‘ ఇక్కడ జగన్ మాటల్లో మనం ఒకటి గుర్తించాలి. వీడు నాకన్నా గొప్పవాడు అంటే అర్థం ఏమిటి..? వాడు గొప్పవాడు.. నేను కూడా గొప్పవాడినే. ఇతడు నాకన్నా ఎక్కువ సాధించాడు అంటే అర్థం ఏంటి..? అతను బాగా సాధించాడు.. నేను కూడా ఎంతో కొంత సాధించాను అని. అలాగే కొన్ని కొన్నిసార్లు వాడు నాకంటే పెద్ద ఎదవ అంటారు. అంటే అర్ధం ఏంటి.. వాడు పెద్ద ఎదవ నేను ఓ రేంజ్ ఎదవనని. వాడు నాకంటే దుర్మార్గుడు అంటే నేను దుర్మార్గుడ్ని అని. నాకన్నా పెద్ద దొంగ అంటే నేను కూడా దొంగనే అని ఇలా చెప్తుంటాం మనం.’’ అని అన్నారు. 

‘‘ జగన్ చెప్పిన దాంట్లోనూ ఇదే కనిపిస్తోంది. నాకో స్టేజ్ ఉంది.. నాకో లెవల్ ఉంది. నా మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఇదీ నా రేంజ్. నాకంటే ఎక్కువ రేంజ్‌కి వెలిపోయారంటే.. ఒక రకంగా జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడిని చూసి చిన్న జెలసీ ఫీల్ అవుతున్నారు. దీనిపై మీరేమంటారు’’ అంటూ నాగబాబు వీడియోలో పేర్కొన్నారు. 

 

read more news

రూట్ మార్చిన నాగబాబు..లోకేష్ బాబు గ్రేట్ అంటూ...