మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఏపీ మంత్రి నారా లోకేష్ ని టార్గెట్ చేశారు. మై ఛానెల్ నా ఇష్టం అంటూ నాగబాబు కొత్త యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ.. రోజుకో వీడియో విడుదల చేస్తానని ప్రకటించిన నాగబాబు.. చెప్పినట్లుగానే వీడియో విడుదల చేస్తున్నారు.

మొదటి వీడియో లోకేష్ , రెండో వీడియో జగన్ ది విడుదల చేసిన నాగబాబు.. తాజాగా మరోసారి లోకేష్ బాబు రైట్ అంటూ మన ముందుకు వచ్చారు. గతంలో లోకేష్ పొరపాటున నోరు జారి మాట్లాడిన మాటలను మెగా బ్రదర్ టార్గెట్ చేశారు.  ‘‘ అన్నా.. ఒకటి ఆలోచించండి.. పొరపాటున కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేస్తే మనం మన ఉరివేసుకున్నట్లు అవుతుంది’’ అని లోకేష్ అన్న కామెంట్స్ ని చూపించారు నాగబాబు.

అనంతరం నాగబాబు మాట్లాడుతూ..‘‘ చూశారా లోకేష్ బాబు ఏమంటున్నారాో.. టీడీపీ కి ఓటు వేస్తే మన ఉరి మనమే వేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు. దానిని మనం తప్పుగా తీసుకోకూడదు. ఆయనలో ఉన్న ఇన్నోసెన్స్ అలాంటిది. ఆయన నిజాయితీ అలా బయటకు వస్తూ ఉంటుంది. ఆయన చెప్పింది ఒప్పుకోవాలి. లోకేష్ బాబు రైట్’ అంటే వ్యంగాస్త్రాలు వేశారు. ఒక్కసారి లోకేష్ కి ఓ వేసుకోండి అంటూ వీడియో ముగించారు. 

 

read more news

ఓ రేంజ్ ఎదవ.. జగన్ పై నాగబాబు కామెంట్స్

రూట్ మార్చిన నాగబాబు..లోకేష్ బాబు గ్రేట్ అంటూ...