ప్ర‌ముఖ హాస్పిట‌ల్ మెడిక‌వ‌ర్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. పిల్లల గుండె చికిత్సకు మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం కు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ల‌భించింది.

పుట్ట‌గానే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న చిన్నారులకు మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం ఓ నూతన ఆశగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెడికవర్‌ను డా. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పిల్లల హృదయ చికిత్సల కొరకు అధికారిక రెఫరల్ సెంటర్ గా గుర్తించింది.

ఈ గుర్తింపుతో, ఉత్తరాంధ్రలోని పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు మెడికవర్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్, డయాగ్నాస్టిక్ టెస్టులు, క్యాథెటర్ ఆధారిత చికిత్సలు, హార్ట్ సర్జరీలు అందనున్నాయి. ఇటీవల జిల్లా వైద్యాధికారులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల వర్గీయులు మెడికవర్లో తనిఖీ జరిపి, సాంకేతిక మౌలిక వసతులు, వైద్య నిపుణుల సేవలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సేవల వెనుక డా. అశోక్ రాజు ఆళ్లూరి అనే ప్రముఖ పిల్లల కార్డియాలజిస్టు ఉన్నారు. గత ఏడాదిలో 1,000కి పైగా చిన్నారులకు స్క్రీనింగ్ చేసి, 250కిపైగా విజయవంతమైన హృదయ చికిత్సలు అందించారు. వీరిలో చాలా మంది చికిత్సకు ఖర్చు భరించలేని నేపథ్యం నుంచి వచ్చినవారే. ప్రజలకు సేవలు మరింత చేరువ చేయడానికై, మెడికవర్ ప్రతి నెల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాల్లో DEIC కేంద్రాల్లో హార్ట్ క్యాంపులు నిర్వహించనుంది.

అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు, ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రాల చిన్నారులకు పూర్తి ఉచిత సేవలు లభించనున్నాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మిషన్ లక్ష్యాలను పురిగొల్పే విధంగా కొనసాగుతుంది.