కేటీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల సమావేశం తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లోని పార్టీల అధినేతను స్వయంగా కలిసిన టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరి జగన్‌ని మాత్రం కలవకుండా తన కుమారుడిని ఎందుకు పంపించాడని ఇప్పుడు చాలామంది జుట్టు పీక్కొంటున్నారు. 

దీనికి తెరదించుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అమరావతిలో జగన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై మాట్లాడతారని కేటీఆర్ తెలిపారు. దీంతో ఇద్దరు నేతల భేటీ ఎప్పుడు జరుగుతుంది.. ఎక్కడ జరుగుతుంది అంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది.

అయితే, ఇప్పటికే వీరిద్దరి మిలాఖత్‌కు డేట్, టైమ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తాను నిర్మించుకున్న ఇంట్లో ఫిబ్రవరి 14న గృహ ప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించుకున్న జగన్ .. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అక్కడే ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని, అలాగే ఫ్రంట్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను కూడా చెబుతారని ప్రచారం జరుగుతుంది. మరి ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

జగన్ ఏమైనా అంటరానివాడా? ప్రచారం చేస్తాం.. టీఆర్ఎస్ ఎంపీ

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

జగన్‌తో కేటీఆర్ భేటీపై అసద్ ఆసక్తికర ట్వీట్

జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ భేటీ (ఫొటోలు)

జగన్ సీఎం కావాలంటూ.. తెలంగాణ నేతల తిరుమల యాత్ర

జగన్ తో కేటీఆర్ భేటీ నేడే: మతలబు ఇదే...