Markapuram Bus Accident : ప్రమాదమని తెలిసినా..మార్కాపురం బస్సుఘటనలో తప్పెవరిది?

Share this Video

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణలోని జగిత్యాల నుండి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణిస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, సాంకేతిక లోపాలపై ప్రయాణికులు ముందే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ప్రయాణం కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం నెల్లూరు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు.సహాయం కోసం కంట్రోల్ రూం నంబర్లు:📞 7995575699📞 0861-2331261

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video