సేవ పేరుతో చిన్నారులపై పైశాచికత్వం.. రౌడీషీటర్ కు దేహశుద్ధి....

గత గురువారం కూడా పాఠశాలకు వెళ్లి చిన్నారులకు Giftలు అందించారు. కొందరికి ఇంటికి వస్తే అట్టలు ఇస్తానన్నారు.  అతని నైజం తెలియని వారు వెళ్లారు. తర్వాత ట్యూషన్ కు తోటి విద్యార్థినులతో కాకుండా ఆలస్యంగా వెళ్లడం.. ఆందోళనగా ఉండడంతో.. టీచర్ కారణం అడిగింది. వారు జరిగింది చెప్పారు.

man thrashed by students parents for obscenity behaviour with girls in visakhapatnam

సాయం ముసుగులో రమ్మన్నాడు.. ఆపై అతనిలో క్రూరత్వం, పైశాచికం బయటపడ్డాయి.. పసిపిల్లలను కనికరం చూపలేదు.. అమాయకపు girls అనే దయ కలగలేదు..  వారితో అసభ్యంగా ప్రవర్తించాడు...  ఇంత దారుణంగా వ్యవహరించిన దోమాన చిన్నారావు తీరు సోమవారం వెలుగుచూసింది.. విద్యార్థినుల కుటుంబీకులు... స్థానిక యువకులు ఆగ్రహంతో దేహశుద్ధి చేశారు.

నిందితుడికి గాయాలు కావడంతో అతన్ని KGHకు పంపారు. మరికొందరు పిల్లల తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆ కోణంలో వివరాల సేకరణ మొదలుపెట్టారు. అతనిపై pocso case నమోదు చేశారు.

సేవ పేరుతో…
మల్కాపురం ప్రాంతానికి చెందిన దోమాన చిన్నారావు Rowdysheeter. మూడేళ్ల కిందట ‘Chinnarao Welfare Society’ పేరుతో ఒక సంస్థను నెలకొల్పాడు. నాటి నుంచి పలువురికి సన్మానాలు చేయడం, పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం.. పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, తదితరాలను ఉచితంగా పంపిణీ చేస్తూ వచ్చారు.  ఇటీవల పలువురు ప్రముఖులకు సైతంAwardలు అందించారు. ప్రకాష్ నగర్ జివిఎంసి ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమాలు చేశారు. ఆయా కార్యక్రమాల వెనక ఆ రౌడీషీటర్ దుర్బుద్ధి ఉందనే విషయం సోమవారం నాటి ఘటనతో వెలుగులోకి వచ్చిందని victims Families మండిపడ్డారు.

అనుమానం రావడంతో…
గత గురువారం కూడా పాఠశాలకు వెళ్లి చిన్నారులకు Giftలు అందించారు. కొందరికి ఇంటికి వస్తే అట్టలు ఇస్తానన్నారు.  అతని నైజం తెలియని వారు వెళ్లారు. తర్వాత ట్యూషన్ కు తోటి విద్యార్థినులతో కాకుండా ఆలస్యంగా వెళ్లడం.. ఆందోళనగా ఉండడంతో.. టీచర్ కారణం అడిగింది. వారు జరిగింది చెప్పారు. మరి కొందరు కూడా అదే తరహాలో వివరాలు వెల్లడించడంతో ఆమె సోమవారం ఉదయం GVMC High Schoolకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించింది. అతని ఇంట్లో జరిగిన విషయాలు మాకు ఎలా తెలుస్తాయి అంటూ చిన్నారావునే పిలిపిస్తాను అంటూ ఆయన్ని పాఠశాలకు పిలిపించారు.

వంట చేస్తుండగా గ్యాస్ లీక్... మంటలంటుకుని దంపతులు మృతి..

ఇంటికి పిలిచి…
పాఠశాలకు సమీపంలోనే చిన్నారావు నివాసం. కొందరికి బహుమతుల పంపిణీ చేసి మిగిలిన వారిని ఇంటికి వచ్చి తీసుకోమనేవారు. అతని నిజ స్వరూపం తెలియని పసి పిల్లలు ఉచితమే కదా అని.. ఇంటికి వెళ్ళేవారు. ఆ తర్వాత వారి పట్ల చాలా అసభ్యంగా, వికృతంగా ప్రవర్తించిన విషయం చర్చనీయాంశమైంది.  నాలుగు, ఐదో తరగతి చదువుతున్న కొందరు విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  కొందరు బాలికలు తమకు ఏం జరిగిందన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు తమ పరువు పోతుందన్న భయంతో బయటకు చెప్పకుండా, కన్నీటిని దిగమింగుకుని..  అంతులేని ఆవేదన అనుభవించారు.  తమలో తామే కుమిలిపోయారు. చివరికి విషయం సోమవారం బయటపడింది.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం…
చిన్నారావు ప్రవర్తనపై అప్పటికే తీవ్ర ఆగ్రహం ఉన్న విద్యార్థుల తల్లులు పాఠశాలకు చేరుకున్నారు. అతడిని ప్రశ్నించారు. వారిని అతను బెదిరించడంతో అందరూ కోపోద్రిక్తులై దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  మహిళా పోలీసులు పలువురు పిల్లలను విచారణ చేసి ఆరా తీశారు. కొందరు బాలికలు పూస గుచ్చినట్లు చెప్పడంతో చిన్నారావు వికృత చేష్టలు బయటపడ్డాయి. ఆరో తరగతి బాలికలు నలుగురు, ఐదో తరగతి బాలిక  ఒకరు, నాలుగో తరగతి బాలిక ఒకరు పోలీసులకు వివరాలు తెలియజేశారు. కొందరు బాలికల తల్లిదండ్రులు కూడా పోలీసులకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మరో 14 మంది బాలికలను కూడా లైంగికంగా వేధించినట్లు ప్రాథమికంగా తల్లిదండ్రులకు తెలిసింది.

వస్తే కాదనలేం కదా..
‘చిన్నారావు గురించి మాకు తెలియదు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలిస్తే అనుమతించాం, పాఠశాలలో కొన్ని విగ్రహాలు కూడా ఏర్పాటు చేయించారు. ఆయన కుమార్తె కూడా ఇక్కడే చదువుతోంది. కూతురు కోసం పాఠశాలలోకి వస్తానంటే కాదనలేను కదా...? ఇలాంటి పనులు చేస్తాడని ఊహించలేదు.  పసిమొగ్గలు అని కూడా చూడకుండా ప్రవర్తించాడు’ అని ప్రధానోపాధ్యాయుడు బి. వెంకటనారాయణ కుమార్ పేర్కొన్నారు.

కేసు నమోదు చేశాం..
నిందితుడు చిన్నారావు పై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  pocso కేసు నమోదు చేశాం.  బాలికలు చెప్పిన వివరాల మేరకు లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. అతన్ని అరెస్టు చేసి ఆసుపత్రికి పంపాం.  తదుపరి దర్యాప్తు చేస్తున్నాం’ అని  హార్బర్ ఏసిపి  శిరీష పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios