Asianet News TeluguAsianet News Telugu

వంట చేస్తుండగా గ్యాస్ లీక్... మంటలంటుకుని దంపతులు మృతి..

పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి (50), అడపా ఇంధ్రకుమారి (44) నవబంర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.     

couple died in gas leak accident in sattupalli
Author
Hyderabad, First Published Dec 6, 2021, 2:29 PM IST

సత్తుపల్లి టౌన్ : వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడిన దంపతులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి... పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి (50), అడపా ఇంధ్రకుమారి (44) నవబంర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా gas leake అయి fire చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.     

వారిద్దరికీ సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీరామమూర్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంద్ర కుమారి మృతి చెందింది. చికిత్స పొందుతూ ఒకేరోజు దంపతులు ఇద్దరూ మృతి చెందడంతో హనుమాన్ నగర్ లో విషాద చాయలు అలుముకున్నాయి. 

ప.గో, కృష్ణా జిల్లాల్లో అంతుచిక్కని వ్యాధి... పిట్టల్లా రాలుతున్న చిన్నారులు: నారా లోకేష్ ఆందోళన

మృతుడు శ్రీరామమూర్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి సతీష్, రాజేష్ అనే ఇద్దరు కుమారుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి మున్నూరుకాపు సంఘం నియోజనవర్గ కో ఆర్డినేటర్ మాధురి మధు, రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి కృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, తోట గణేష్ సంతాపం తెలిపారు. 

ఇదిలా ఉండగా.. మంథనిలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను murder చేసిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను arrest చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సతీష్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని.. గ్రామానికి చెందిన రేణుకను 16 ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు.

వీరి మధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని.. దీంతో రేణుక జూలైలో ఇంటినుంచి వెళ్ళిపోగా స్థానిక పోలీస్ స్టేషన్లో missing case నమోదైందన్నారు. ఈ క్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని చెప్పి భర్తతో వెళ్లిందన్నారు. అయితే కొంతకాలం తర్వాత భార్య మళ్లీ ఇల్లు వదిలి hyderabad కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్లో పని చేస్తున్న విషయం తెలుసుకున్న భర్త బానయ్య.. వారం క్రితం వెళ్ళి ఆమెను తీసుకువచ్చాడు.

చెత్త ఏరుకునే వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో దారుణం..

శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో ఈ విషయం మీద పంచాయతీ పెట్టాడు. అయితే పంచాయితీలో పెద్దల ముందు రేణుక తన భర్తతో కాపురం చేయనని తెగేసి చెప్పి.. వెళ్ళిపోతుండగా తలపై పెద్ద రాయితో నాలుగు సార్లు కొట్టడంతో..  రేణుక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చంద్ర శేఖర్ తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios