పవన్ కళ్యాణ్‌తో బాలశౌరి భేటీ: జనసేనలో చేరికపై చర్చ


మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. 

 machilipatnam mp vallabhaneni Balashowry  meets Pawan Kalyan lns


హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో  మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి  శుక్రవారంనాడు భేటీ అయ్యారు. గత వారమే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)కి బాలశౌరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

హైద్రాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసంలో  బాలశౌరి ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసిన రోజునే జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా బాలశౌరి ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనలో ఏ రోజున చేరే విషయంతో పాటు ఇతర అంశాలపై  పవన్ కళ్యాణ్ తో బాలశౌరి చర్చించనున్నారు.

also read:వై.ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు: సవాళ్లు ఇవీ

2019 పార్లమెంట్ ఎన్నికల్లో  మచిలీపట్టణం  స్థానం నుండి  పోటీ చేసి బాలశౌరి విజయం సాధించారు. అయితే  మచిలీపట్టణం ఎమ్మెల్యే పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య  కొంత గ్యాప్  ఉంది. ఈ గ్యాప్  ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చిందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  ఈ పరిణామాల నేపథ్యంలో  న్యూఢిల్లీలో జరిగిన  ఘటనలు కూడ  బాలశౌరి పార్టీని వీడేందుకు  దోహదం చేశాయనే చర్చ సాగుతుంది. 

also read:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024: కాంగ్రెస్ వ్యూహాలివీ, కలిసొచ్చేనా?

పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న బాలశౌరి వారం రోజుల క్రితం వైఎస్ఆర్‌సీపీకి గుడ్ బై చెప్పారు. బాలశౌరి జనసేనలో చేరడం లాంఛనమే. అయితే  ఏ స్థానం నుండి బాలశౌరిని జనసేన బరిలోకి దింపుతుందనే చర్చ ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో సాగుతుంది.  మచిలీపట్టణం ఎంపీ స్థానం నుండి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని  బాలశౌరి భావిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  జనసేనకు  తెలుగు దేశం పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది...కేటాయించే సీట్లలో  ఏ సీటు నుండి పోటీ చేయాలనే విషయమై  బాలశౌరి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉందనే  పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతుంది.

also read:ప్రపంచంలోనే అతి ఎత్తైన బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం: జాతికి అంకితం చేయనున్న జగన్

వైఎస్ఆర్‌సీపీలో  బాలశౌరి సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. అయితే  వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను టీడీపీ, జనసేన కూటమి వైపు  బాలశౌరి  గాలం వేస్తున్నారనే ప్రచారం కూడ సాగుతుంది.అయితే  వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు  సీట్లు కేటాయించే పరిస్థితి  ఈ కూటమికి ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు.  
 

**

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios