ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఇవాళ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్ కు బయలుదేరడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా ఓ దుండగుడు ఆయనపై కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఏపిలో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని పలువురు నాయకులు పార్టీలకతీతంగా ఇప్పటికే ఖండించారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన  హత్యాయత్నం అమానుషమైందిగా పవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా విశ్వసిస్తోందన్నారు.  ఈ హత్యా ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పవన్ స్పష్టం చేశారు. 

ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోందన్నారు. మరోసారి ఇలాంటి ఘటన పనరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కుట్ర దారులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 

సంబంధిత వార్తలు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు