అమరావతి: బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ మరణం బాధాకరమని అభిప్రాయపడ్డారు. జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.  

దేశ రాజకీయాల్లో జైట్లీకి ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. విద్యార్థి నాయకుడిగా ఎమర్జెన్సీ కాలంలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి 19 నెలలపాటు జైలు జీవితాన్ని గడిపారని చెప్పుకొచ్చారు. 

జైట్లీలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేదని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా జైట్లీ సేవలు మరువలేనివంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక, న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారంటూ ప్రశంసించారు. జైట్లీ కుటుంబానికి తన తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ ప్రజలంటే జైట్లీకీ ప్రత్యేక అభిమానం: సుజనాచౌదరి

తెలంగాణ బిల్లు: ఆ ఇద్దరు కీలక నేతల మృతి

తెలంగాణ బిల్లు: అరుణ్ జైట్లీ కీలక పాత్ర

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి..

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం