దేవుడి దయ, ఆంద్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాయి.
తాను క్షేమంగానే ఉన్నానని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు.ఈ రోజు విశాఖ ఎయిర్ పోర్టులో ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా.. వెంటనే స్పందించిన భద్రతాసిబ్బంది జగన్ ని హుటాహుటున హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘నేను క్షేమంగా ఉన్నాను. దేవుడి దయ, ఆంద్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తాయి. ఇలాంటి పిరికిపంద చర్యలకు నేను భయపడను. ఇలాంటి దాడులతో నా లక్ష్యాన్ని దెబ్బతీయలేరు. ఈ దాడితో.. దేశం, రాష్ట్రం కోసం పనిచేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది.’’ అని జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జగన్ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
read more news
జగన్ పై దాడి... వివాదాస్పద కామెంట్స్ చేసిన మంత్రి
హైదరాబాద్ చేరుకున్న జగన్.. ఎయిర్ పోర్ట్ కి అభిమానులు
వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి
160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి
జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు
