వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన విశాఖ నుంచి హైదరాబాద్ కి వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకోగా.. అక్కడ ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. 

కాగా.. ఎయిర్ పోర్టులో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. జగన్ పై దాడి దృశ్యాలు టీవీలో చూసి ఆయన అభిమానులు చలించిపోయారు. వేలసంఖ్యలో  జగన్ అభిమానులు, కార్యకర్తలు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరకున్నారు.

‘‘జగన్ అన్న’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టు నుంచి జగన్ ని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. 

 

read more news

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు