వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిపై హోం మంత్రి చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్.. సెల్ఫీలు, ముద్దులంటే ముందుంటారని చినరాజప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

కాగా.. ఘటన జరిగిన వెంటనే.. ఈ విషయంపై చినరాజప్ప మాట్లాడారు. ‘‘దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని దాడిని ఖండిస్తున్నా.. అతడు ఎవరు? ఏమిటి? ఏ పార్టీకి చెందిన వాడు ఇలాంటి పూర్తి వివరాల్ని సేకరిస్తున్నాము. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నా. ’’ అని ఆయన అన్నారు.

అనంతరం భద్రతా వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న వైసీపీ వాదనకు కౌంటర్ ఇస్తూ.. ‘‘జగన్ సెల్ఫీ అనగానే ముందుకొచ్చి ముద్దులంటాడు. అతడు జగన్ పొగడటానికి వచ్చాడు.. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజాప్రతినిధిపై ఉంటుంది. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు మేం జాగ్రత్తగా ఉంటున్నాము. ఏది ఏమైనా.. ఎయిర్ పోర్ట్‌పై జరిగిన ఈ దాడిని సహించేది లేదు.. అతడు ఎంతవాడైనా చర్యలు తీసుకుంటాం. పూర్తి వివారాలను సేకరిస్తున్నాం’’ అని చినరాజప్ప