ఘోరం.. భార్యతో వేరొకరు సన్నిహితంగా ఉండేందుకు హెల్ప్ చేస్తున్నాడని.. స్నేహితుడి దారుణ హత్య..
తన భార్యతో మరో వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడని ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. దీనికి తన స్నేహితుడే సహకరిస్తున్నాడని భావించాడు. దీంతో అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖనగరంలో జరిగింది.

భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోందని భర్తకు అనుమానం కలిగింది. దీనికి తన స్నేహితుడే సహకరిస్తున్నాడని భావించి అతడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖనగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డింగు శివకుమార్ (శివారెడ్డి) అనే వ్యక్తి విశాఖనగరంలోని దరి శ్రీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి కొంత కాలం కిందట రెల్లివీధి ప్రాంతానికి చెందిన కిరణ్ ద్వారా 26 ఏళ్ల కలిశెట్టి కిశోర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరువాత కాలంలో వారిద్దరూ స్నేహితులయ్యారు.
కిశోర్ గతంలో ఓ ప్రైవేట కంపెనీలో జాబ్ చేశాడు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అయితే శివారెడ్డి తరచూ మద్యం సేవించి, గంజాయి తాగి తన ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. ఈ తీరు మార్చుకోవాలని భార్య శివారెడ్డికి పలుమార్లు చెప్పింది. అయినా అతడు వినకపోవడంతో ఆమెకు విసుగొచ్చి, తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే ఇదే క్రమలో కిశోర్ ఫ్రెండ్ అయిన ఉదయ్.. శివారెడ్డి భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో అతడికి భార్య తీరుపై అనుమానం కలిగింది.
మద్యానికి బానిసై , బాధ్యతలు గాలికొదిలేసిన కుమారుడు.. సుపారీ ఇచ్చి, హతమార్చిన తల్లిదండ్రులు
ఉదయ్ తన భార్యతో సన్నిహితంగా ఉండేందుకు కిశోర్ హెల్ప్ చేస్తున్నాడని శివారెడ్డి భావించాడు. దీంతో అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ లో భాగంగా మద్యం తాగేందుకు తన అపార్ట్ మెంట్ కు రావాలని శివారెడ్డి కిశోర్ ను ఆహ్వానించాడు. దీంతో అతడు ఆదివారం రాత్రి దేవా, కిరణ్ లను తీసుకొని శ్రీనగర్ లో ఉన్న అపార్ట్ మెంట్ కు వెళ్లాడు. అక్కడ నలుగురూ కలిసి మద్యం తాగారు.
అత్యాచారం చేసి.. కళ్లు పీకి.. జట్టు కత్తిరించి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య!
ఈ క్రమంలో శివారెడ్డి కిశోర్ ను ఏదో కారణం చెప్పి పక్కకు తీసుకెళ్లాడు. మూడు అంతస్తుల భవనం పైనుంచి అతడిని కిందికి తోసేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పెద్ద శబ్దం వినిపించంతో దేవా, కిరణ్ ఇద్దరూ కలిసి కిందికి పరెగెత్తుకుంటూ వెళ్లి చూశారు. అక్కడ కిశోర్ తీవ్ర రక్తస్రావంతో నేలపై పడి ఉన్నాడు. దీంతో వారు వెంటనే బాధితుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మరణించాడు. దీనిపై మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.