మద్యానికి బానిసై , బాధ్యతలు గాలికొదిలేసిన కుమారుడు.. సుపారీ ఇచ్చి, హతమార్చిన తల్లిదండ్రులు
మద్యానికి బానిసై కుమారుడు పెడుతున్న బాధలను ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో వారు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి, వారి సాయంతో కన్న కొడుకును దారుణంగా హతమార్చారు.

మద్యానికి బానిసై, బాధ్యతలను గాలికొదిలేసిన కుమారుడిని తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. ఈ ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎటపాక పోలీసు స్టేషన్ లో రంపచోడవరం ఓఎస్డీ మహేశ్వర రెడ్డి మీడియాతో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని మెడికల్ కాలనీలో 57 ఏళ్ల పగిళ్ల రాము, 55 ఏళ్ల సావిత్రి దంపతులు నివసిస్తున్నారు. వీరికి 35 ఏళ్ల కుమారుడు దుర్గాప్రసాద్ ఉన్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ: తెరపైకి మరోసారి రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్
దుర్గాప్రసాద్ కొంత కాలంగా తాగుడుకు బానిసయ్యాడు. దీంతో ఇంటి బాధ్యతలను గాలికి వదిలేశాడు. అతడి తీరుతో భార్య విసిగెత్తిపోయింది. దీంతో ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయినా అతడు పద్దతి మార్చుకోలేదు. అదే తీరును కొనసాగించాడు. పైగా తల్లిదండ్రులను ఇళ్లు అమ్మేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. వారిని తీవ్రంగా హింసించేవాడు. చాలా కాలంగా కుమారుడు పెడుతున్న బాధలను భరించిన తల్లిదండ్రులు కూడా విసుగెత్తిపోయారు. వారు సహనం కోల్పోయారు. కుమారుడిని హత్య చేయించాని నిర్ణయించుకున్నారు.
ఎన్టీఆర్ కు ద్రోహం చేస్తే నోరు తెరవలేదు.. ఇప్పుడెలా నోరొచ్చింది: పురంధేశ్వరిపై రోజా ఫైర్
దీని కోసం భద్రాచలంకు చెందిన 33 ఏళ్ల గుమ్మడి రాజు, 32 ఏళ్ల షేక్ ఆలీ పాషాలను ఆశ్రయించారు. వారికి 3 లక్షల రూపాయిల సుపారీ ఇచ్చారు. ప్లాన్ లో భాగంగా సుపారీ తీసుకున్న వ్యక్తులు ఈ నెల 9వ తేదీన అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో నిద్రపోతున్న దుర్గాప్రసాద్ ను నలుగురు కలిసి హతమార్చారు.
బిలాస్‌పూర్ టు రాయ్‌పూర్.. ట్రైన్‌లో ప్రయాణించిన రాహుల్ గాంధీ (Video)
తరువాత డెడ్ బాడీని ఆటోలో ఎక్కించుకొని, తుమ్మలనగర్ అడవి ప్రాంతంలో ఉన్న గానుగ చెట్ల తోట వద్దకు తీసుకొచ్చారు. అక్కడ డెడ్ బాడీపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి, ఆ నలుగురు ఊరు వదిలిపెట్టి పారిపోయారు. అయితే మరుసటి రోజు మధ్యాహ్నం పుల్లల కోసం ఓ వ్యక్తి అడవి ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కాలిపోయిన డెడ్ బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నేడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ విచారణ.. సర్వత్రా ఉత్కంఠ!!
దీనిపై ఎటపాక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. డెడ్ బాడీ ఫొటోతో కరపత్రాలు తయారు చేయించారు. వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని సరిహద్దు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. అయితే తెలంగాణలో ఉంటున్న దుర్గాప్రసాద్ భార్య ఆ ఫొటోను గుర్తుపట్టింది. పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో మృతుడి తల్లిదండ్రులు, ఇద్దరు నిందితులను గుర్తించారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.