అత్యాచారం చేసి..  కళ్లు పీకి.. జట్టు కత్తిరించి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య!

చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మ‌ృతిపై రోజురోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తొలుత ఆత్మహత్యగా భావించినా..  మృతదేహంపై గాయాలు ఉండటం, మృతురాలి తలపై జుట్టు లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మరోవైపు.. తన కుమార్తెను ప్రేమ పేరుతో తన కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారని, తమ కుమార్తెపై అత్యాచారం చేసి.. కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆరోపించారు మ‌ృతురాలి తల్లిదండ్రులు .   

Chittoor Inter Girl Bhavyasri Incident Shocking Facts KRJ

చిత్తూరు జిల్లాలోని ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మ‌ృతిపై రోజురోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మొదట సాధారణ ఆత్మహత్యగా భావించారు. కానీ , మృతదేహంపై గాయాలు ఉండటం, మృతురాలి తలపై జుట్టు లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రేమ పేరుతో తన కుమార్తెను ముగ్గురు యువకులు వేధించారనీ, ఆ యువకులే తన కుమార్తెకు మాయమాటలు చెప్పి.. ఇంటి నుంచి తీసుకెళ్లారని అన్నారు.  కళ్లు పీకేసి, జుట్టు కత్తిరించి, దారుణంగా హత్య చేసి, బావిలో పడేశారని ఆరోపించారు.  తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరేవరికి జరగకూడదనీ, దోషులకు కఠినంగా శిక్షించాలని మ‌ృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.  

వివరాల్లోకెళ్తే.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కావూరివారిపల్లె గ్రామానికి పంచాయతీ లోని వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల కుమార్తె భవ్యశ్రీ(16). భవ్యశ్రీ  పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే భవ్యశ్రీ కి గజేంద్ర,కుమార్ అనే ఇద్దరూ యువకులతో పరిచయం ఏర్పడింది. వారితోనే బయటకు వెళ్లింది. ఈనెల 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల వెతికారు. బంధువులకు , స్నేహితులకు ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఆశ్రయించారు.

 మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఈ నెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ బావిలో యువతి మృతిదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం భవ్యశ్రీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే.. మృతదేహానికి  జట్టు లేకపోవడంతో భవ్యశ్రీని చంపేసి, కళ్లు పీకి, జుట్టు కత్తిరించి, మృతదేహాన్ని బావిలో పడేశారని తల్లిదండ్రులు భావించారు. మరోవైపు భవ్యశ్రీ ధరించిన లెగిన్స్ లేకపోవడం, అలాగే.. నాలుక కొరికినట్లుగా ఉండటంతో యువతిపై దాడి చేసి.. బలవంతంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని ఆరోపించారు. 

పోలీసులు ఏమంటున్నారంటే..?  

భవ్యశ్రీ(16) మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తాజాగా.. భవ్యశ్రీ వెంట్రుకలు లభించాయని వాటిని సైతం తిరుపతిలోని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపించామని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ జరుగుతోందని, అయితే.. మూడు, నాలుగు రోజులుగా మృతదేహం నీటిలో ఉండటం వల్ల వెంట్రుకలు విడిపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇద్దరు యువకులకు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు. ఆమె, తల్లిదండ్రుల కాల్స్ డేటాను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios