Asianet News TeluguAsianet News Telugu

నేడు జగ‌న్‌కు రాజధానిపై నిపుణుల కమిటీ తుది నివేదిక

ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీ తుది నివేదికను శుక్రవారం నాడు సీఎం జగన్ కు ఇచ్చే అవకాశం ఉంది. 

GN Rao Committee likely to submit report on AP capitals
Author
Amaravathi, First Published Dec 20, 2019, 7:37 AM IST

అమరావతి:ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ తమ తుది నివేదికను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది.

Also read: ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశంపై సీఎం సంకేతాలు ఇచ్చే రీతిలో ప్రకటన చేశారు. ఈ విషయమై నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. ఈ వారంలోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. నిపుణుల కమిటీ తర్వాత రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.

Also read:ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...

అయితే అమరావతి నుండి రాజధానిని మార్చకూడదని అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల రైతులు  ఈ నెల 19వ  తేదీన బంద్ నిర్వహించారు. పురుగుల మందుల డబ్బాలు పట్టుకొని నిరసనకు దిగారు. 

Also read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

మూడు రాజధానుల అంశంపై కూడ టీడీపీలో భిన్న స్వరాలు వ్యక్తమౌతున్నాయి. మూడు రాజధానుల అంశాన్ని చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పార్టీ నేతలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. 

Also read:లోకేష్ తో వ్యాపారం... పచ్చి అబద్ధం... వేమూరి వివరణ

ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇవాళ తుది నివేదికను ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

నిఫుణుల క‌మిటి నివేదిక పై స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది. నిజంగానే మూడు రాజధానులు ఉండాలని కమిటీ సూచిస్తే ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న రాజధానిని తరలించాలని సిఫారసు చేస్తోందా ఇక్కడే కొనసాగించాలని సూచిస్తోందా అనే చర్చలు సాగుతున్నాయి.

ఈ కమిటీ అన్ని ప్రాంతాల అభివృద్దికి ఏలాంటి సూచ‌న‌లు చేయ‌నుంది.ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌జ‌ల అభిప్రాయాలు సేక‌రించింది నిపుణుల కమిటీ. 
 

Follow Us:
Download App:
  • android
  • ios