Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ తో వ్యాపారం... పచ్చి అబద్ధం... వేమూరి వివరణ

రాజధాని అమరావతి ప్రాంతంలో తాను 500 ఎకరాలు కొనుగోలు చేసి రూ.650కోట్లకు అమ్మానంటూ గత మూడేళ్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

vemuri ravi kumar gave clarity over buggana allegations
Author
Hyderabad, First Published Dec 19, 2019, 12:05 PM IST


లోకేష్ తో తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఏపీఎన్ఆర్టీ మాజీ అధ్యక్షుడు  వేమూరి రవికుమార్ స్పష్టం చేశారు.  ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధాని ప్రకటనకు ముందు తాను భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే... ఆ భూములను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి అప్పగిచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.

 రాజధాని అమరావతి ప్రాంతంలో తాను 500 ఎకరాలు కొనుగోలు చేసి రూ.650కోట్లకు అమ్మానంటూ గత మూడేళ్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలోనూ మంత్రి బుగ్గన తనపై కామెంట్స్ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను లోకేష్ కి సన్నిహితుడని.. వ్యాపారంలో భాగస్వామినని పేర్కోన్నారని... కానీ అవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పారు.

25.68 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు  కూడా మంత్రి బుగన ఆరోపించారని... అది నిజం కాదని తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఏప్రిల్‌ 2004, 2005ల్లో 6.30 ఎకరాలు కొనుగోలు చేశానని చెప్పారు. రాజధాని ప్రకటన వచ్చాక 9.86 ఎకరాలు కొన్నానని తెలిపారు.

 ఈ 16.16 ఎకరాల్లో ఆరు ఎకరాలు రాజధాని పరిధికి అవతల ఉందని చెప్పారు.  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా రాజధాని ప్రకటనకు ముందు నేను భూములు కొనుగోలు చేశానని నిరూపిస్తే.. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అభ్యంతరం లేదు అని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios