
Heavy Rains Alert: ఈ వారం భారీ వర్షాలు, ఈదురుగాలులు ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే!
మే అంటేనే మండుటెండలు... ఏడాది మొత్తంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల. కానీ, ఈసారి మే నెలలోకి ఇలా ఎంటరయ్యామో లేదో.. అలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వర్షాలు కూడా జోరందుకుంటాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మే మొదటి వారం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Add Asianetnews Telugu as a Preferred Source
