ఇంటర్నెట్ చూసి బాలికపై రెండు నెలలుగా రేప్

First Published 24, May 2018, 11:03 AM IST
Five Persons sexually Assaults 11 year old girl
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు రెండు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు. 

ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాలికను వారు బెదిరించారు. బాలిక విషయాన్ని వాళ్ల అమ్మకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

దీంతో అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిని పట్టుకుని వారిని గ్రామస్తులు చితకబాదారు. మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

దెబ్బలు తిన్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం

loader