అమరావతి: రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో  భేటీ అయింది.  ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం  ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల క్రితం సంకేతాలు ఇచ్చారు. నిపుణుల కమిటీ నివేదిక రాగానే రాజధానిపై ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది.

Also read:నేడు జగ‌న్‌కు రాజధానిపై నిపుణుల కమిటీ తుది నివేదిక

ఇప్పటికే మూడు రాజధానులు అనే విషయమై అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాలకు చెందిన రైతులు  ఆందోళనకు దిగారు.  రెండు రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. 

మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీకి చెందిన కొందరు సీనియర్లు మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Also read: ఏపీకి మూడు రాజధానులు: వెలగపూడిలో రైతుల దీక్షలు

జీఎన్ రావు కమిటీ ఇప్పటికే సీఎంకు మధ్యంతర నివేదికను ఇచ్చింది.అసెంబ్లీలో ప్రకటన చేసిన మూడు రోజులకే జీఎన్ రావు కమిటీ భేటీ కావడంతో  ప్రాధాన్యత సంతరించుకొంది. ఏపీకి రాజధాని విషయంలో  రాష్ట్రప్రభుత్వం ఇవాళ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Also read:ఏపీకి మూడు రాజధానులు : పురుగుల మందు డబ్బాలతో రోడ్డు మీదికి...

ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇవాళ తుది నివేదికను ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

Also read:రాజధానిపై నిపుణుల కమిటీ: జగన్‌ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

నిఫుణుల క‌మిటి నివేదిక పై స‌ర్వ‌త్రా ఆసక్తి నెలకొంది. నిజంగానే మూడు రాజధానులు ఉండాలని కమిటీ సూచిస్తే ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న రాజధానిని తరలించాలని సిఫారసు చేస్తోందా ఇక్కడే కొనసాగించాలని సూచిస్తోందా అనే చర్చలు సాగుతున్నాయి.

ఈ కమిటీ అన్ని ప్రాంతాల అభివృద్దికి ఏలాంటి సూచ‌న‌లు చేయ‌నుంది.ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌జ‌ల అభిప్రాయాలు సేక‌రించింది నిపుణుల కమిటీ.