అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆవేశంతో ఊగిపోయారు. తమాషాగా ఉందా అంటూ కన్నెర్రజేశారు. అధికార పక్షం అంటే హుందా తనంతో ఉండాలని చెప్పుకొచ్చారు.

 లెక్కలేని తనంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని చూస్తున్నానంటూ విరుచుకుపడ్డారు. ఇలాంటి పరిస్థితులు సబబు కాదంటూ విరుచుకుపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై తాను అనలేని దానికి క్షమాపణలు చెప్పాలా అంటూ నిలదీశారు. 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇంటి వద్దకు వచ్చి ప్రజలు ధర్నాలు చేస్తుంటే 144 సెక్షన్ పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావ్ అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. ముందు దానికి సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. 

సున్నా వడ్డీ పథకం ప్రవేశపెట్టామో, నిధులు విడుదల చేశామో లేదో అన్నది రికార్డులు చూసుకోవాలి. అసలు దానికోసం మాట్లాడని తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయమనడం ఏంటంటూ విరుచుకుపడ్డారు. 

ఇష్టం వచ్చినట్లు అసత్యాలు చెప్తే సరిపోతుందా అంటూ ధ్వజమెత్తారు. ఆ పెద్దమనిషి ఈ పెద్దమనిషి అంటున్నావ్ నిన్ను చిన్నమనిషి అనాలా అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాన్ని హేళన చేస్తావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. గాడిదలు కాసావా అంటూ తనను అవమానిస్తావా అంటూ రెచ్చిపోయారు. 

తమాషాగా ఉందా అంటూ నిలదీశారు. మీరు ఏమంటే దానికి తాము పడాలా. నా వయసుకు తగ్గట్లు గౌరవంగా మాట్లాడటం కూడా నేర్చుకోవా. ఇదేనా పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వచ్చింది నీకు ఈ ఎగతాళి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 

ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని కూర్చోవాలంటూ చంద్రబాబుకు చెప్పడంతో జగన్ వ్యాఖ్యలను ఖండించాల్సిన బాధ్యత మీపై లేదా అని స్పీకర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు రూపాయి ఇవ్వలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తావా: వైయస్ జగన్ సవాల్

పంతాలకు పట్టింపులకు పోవద్దు, ఎక్కడో ఉంటారు: చంద్రబాబుపై అంబటి ధ్వజం

ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్