అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. 

రూ.84వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు సకాలంలో డబ్బులు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ ప్రకటించారు.

అలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందిచే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. పగటిపూట 9గంటలు నాణ్యమైన విద్యుత్ అందించబోతున్నట్లు తెలిపారు. వచ్చే జూన్ నాటికి 40శాతం ఫీడర్లలో కూడా పగటి పూటే 9గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఇకపోతే ఆక్వారైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి వారిని ఆదుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పథకం వల్ల రూ.720 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకొచ్చారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు తిరగకముందే మరో కొత్త పథకం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వైయస్ఆర్ ఉచిత పంటభీమా పథకం. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతుల తరపున కోటి రూపాయలు పైగా ఇన్సూరెన్స్ చేయించినట్లు జగన్ స్పష్టం చేశారు. అలాగే రైతుల ధరకు మద్దతు కల్పించేందుకు రూ.3వేల కోట్లతో రైతు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

అలాగే ఆయిల్ పామ్ రైతులకు మద్దతు ధర కల్పించి వారికి మరింత చేదోడుగా నిలిచామని జగన్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఆయిల్ పామ్ రేటు వేయిరూపాయలు కంటే ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తక్కువగా ఉందని ధరలు పెంచాలని గత ప్రభుత్వాన్ని మెుత్తుకున్నా వినే నాదుడే లేడని జగన్ విమర్శించారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ.80కోట్లు విడుదల చేసినట్లు జగన్ స్పష్టం చేశారు. ఫలితంగా లక్ష 10 వేల మంది రైతులు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. 


ఈ వార్తలు కూడా చదవండి

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్