Asianet News TeluguAsianet News Telugu

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్

పంట నష్టపోయిన రైతుకు ఇన్ పుట్ సబ్సిడీ లేదా, నష్టపరిహారం రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇకపోతే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదని ఆరోపించారు. విత్తనాలు ఎప్పుడు సేకరించాలి ఎలా సేకరించాలి అనే అంశంపై కూడా అవగాహన లేకుండా చంద్రబాబు ప్రభుత్వం పనిచేసిందని మండిపడ్డారు.

ys jagan fires on chandrababu government over seeds
Author
Amaravathi, First Published Jul 11, 2019, 1:24 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా కరువు విలయతాండవం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో కరువు సంభవించిందన్నారు.    

గత ప్రభుత్వంలో వచ్చిన కరువును రూపుమాపేందుకు ఆ ప్రభుత్వం ప్రయత్నించలేదని ఆరోపించారు. 2013-14 సంవత్సరంలో తీవ్రమైన కరువు, వరుస తుఫానులతో ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.  

రైతులకు ఇవ్వాల్సిన 2,300 కోట్లు ఇన్ పుట్ సబ్సీడీని ఎగ్గొట్టిన పరిస్థితి ఈ అసెంబ్లీలోనే చూశామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.  బాధల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి వారిని మరింత ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో కరువు మరింత తీవ్రంగా మారిందని జగన్ స్పష్టం చేశారు. కరువు రూపుమాపేందుకు రూ.1832 కోట్లు అవసరమని గత ప్రభుత్వం లెక్కలు కట్టిందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా అవి రైతులకు అందించలేదన్నారు. 

పంట నష్టపోయిన రైతుకు ఇన్ పుట్ సబ్సిడీ లేదా, నష్టపరిహారం రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇకపోతే ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదని ఆరోపించారు. 

విత్తనాలు ఎప్పుడు సేకరించాలి ఎలా సేకరించాలి అనే అంశంపై కూడా అవగాహన లేకుండా చంద్రబాబు ప్రభుత్వం పనిచేసిందని మండిపడ్డారు. అందువల్లే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. 

ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు అంటే గత ఏడాది నవంబర్ లోనే విత్తనాలు సేకరణ చేపట్టాల్సి ఉన్నా ఆదిశగా ప్రభుత్వం పనిచేయలేదని విమర్శించారు. మే నెలాఖరుకు పూర్తి చేసి జూన్ నాటికి విత్తనాలు అందించాల్సింది పోయి చోద్యం చూసిందని మండిపడ్డారు.  

జూన్ నాటికి 4.41 లక్షల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 50వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేయాలని చంద్రబాబుకు అధికారులు లేఖలపై లేఖలు రాసినా ఎక్కడా స్పందించలేదని విమర్శించారు చంద్రబాబు నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios