అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సున్నావడ్డీ పథకంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. సవాల్ ప్రతిసవాల్ తో సభ దద్ధరిల్లిపోతుంది. వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం తామే ప్రారంభించామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అసలు అమలు చేయలేదంటూ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 

తాము కూడా సున్నావడ్డీని అమలు చేశామని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు స్పష్టం చేశారు. తాము రైతులకు సున్నావడ్డీ పథకం అమలు చేశామని చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన సీఎం వైయస్ జగన్ ఆధారాలతో సహా చూపిస్తా చంద్రబాబు అనే పెద్దమనిషి రూపాయి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. 

2014 నుంచి 2019 వరకు అంటే ఐదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ పథకం కింద రైతులకు ఇవ్వలేదన్నారు. రికార్డులు రప్పిస్తానని జగన్ స్పష్టం చేశారు. మనిషిగా ఇన్ని అబద్దాలు ఆడుతారా అంటూ నిలదీశారు. రూపాయి ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేసి పోతారా అంటూ చంద్రబాబుపై నిప్పులుచెరిగారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. 

ఈ వార్తలు కూడా చదవండి

పంతాలకు పట్టింపులకు పోవద్దు, ఎక్కడో ఉంటారు: చంద్రబాబుపై అంబటి ధ్వజం

ఆ ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్తేనే జగన్ కి ధన్యవాదాలు చెప్తా: చంద్రబాబు మెలిక

నా పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు, చివరికి నేనే అమలు చేస్తున్నా: సీఎం జగన్

జగన్ అనే వ్యక్తి వెళ్తేనే చంద్రబాబులో కదలిక వచ్చేది...ఇప్పుడు అలా కాదు: వైయస్ జగన్

రైతును ఆదుకోవాల్సింది పోయి ఇన్ పుట్ సబ్సీడీ ఎగ్గొట్టారు: చంద్రబాబుపై జగన్ ఫైర్