Asianet News TeluguAsianet News Telugu

కరువుసీమలో ‘సేంధ్రియ’ విప్లవం

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో సాగు కోసం రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతున్న విషయం బయటపడింది.

efforts to improve Organic agricultureo

 

 వ్యవసాయ రంగానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఓ మంచి ప్రయత్నం మొదలుపెట్టింది. కరువు నేలలో ‘సేంధ్రియ’ విప్లవాన్ని తీసుకురావటంపై చంద్రబాబు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టంది.

 

రశాయన ఎరువులతో పొలాలన్నీ తడారిపోతున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం రైతులను సేంధ్రియసాగు వైపు మళ్ళించాలని నిర్ణయించుకున్నది. అందుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్ధ విప్రో వ్యవస్ధాపకుడు అజీంజీ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో ముందుకు సాగాలని కూడా నిర్ణయించింది.

 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో సాగు కోసం రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతున్న విషయం బయటపడింది. రసాయన ఎరువులతో భూమిలో కర్బనం తగ్గిపోతున్న విషయం కూడా వెల్లడైంది. కర్బనం తగ్గిపోవటమంటే, మట్టిలో నీటిశాతం తగ్గిపోయి పొడిబారిపోవటం. అంటే మట్టి కాస్త క్రమేణా ఇసుకలాగ మారిపోతోంది.

 

ఒకసారి మట్టి కాస్త ఇసుకలాగ మారిపోతే ఇక సదరు భూముల్లో పంటలు పండవు. ఇదంతా రసాయన ఎరువుల వాడకం వల్లే జరుగుతోందన్న విషయాలు పరిశోధనల్లో బయటపడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అదే విషయమై దృష్టి పెట్టారు.

 

నిత్య కరువు జిల్లాగా పేరుపడిన అనంతపురం జిల్లాలో సేంధ్రియ సాగు పద్దతులను  ప్రయోగాత్మకంగా చేపట్టాలని గట్టిగా అనుకున్నారు. అందుకనే అదే అంశంపై ఆసక్తిగా ఉన్న అజీంజీ ప్రేమ్ జీ ఫౌండేషన్ తో మాట్లాడారు. రాష్ట్రంలో తన సేవలు అందించేందుకు ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చింది.

 

రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోనూ సేంధ్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటమే ఫౌండేషన్ ఉద్దేశ్యంగా పెట్టుకుంది. ప్రతీ గ్రామంలోనూ ఫౌండేషన్ కొంతమంది రైతులను ఎంపిక చేసి క్లస్టర్లుగా మారుస్తుంది. 300 మంది రైతులతో ఓ క్లస్టర్ను ఎంపిక చేస్తుంది. రాష్ట్రంలోని 1.21 లక్షల హెక్టార్ల పరిధిలో 131 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఫౌండేషన్ ప్రణాళిక రూపొందించింది.

 

రాష్ట్రం మొత్తం మీద 39 వేలమంది రైతులను ఈ ప్రాజెక్టులో భాగస్తులుగా చేయాలన్నది ఉద్దేశ్యం. సేంధ్రియ సాగులో రైతులకు మెళుకువలు నేర్పించటం, అవసరమైన పరికరాలు సమకూర్చటం, వాడకం తదితరాలపై రైతులకు శిక్షణ ఇస్తుంది. గ్రామ, మండల, జిల్లా స్ధాయిల్లో క్టస్టర్లను ఏర్పాటు చేయాలన్నది ఫౌండేషన్ ఆశయం.

 

వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ప్రభుత్వంతో కలసి ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున సేంధ్రియ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వటమన్నది బహుశా దేశంలో ఇదే మొదటిసారేమో.

Follow Us:
Download App:
  • android
  • ios